భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రారంభం
హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ ఓనర్లకు గుడ్ న్యూస్. మీరు మీ ఫేవరెట్ హ్యార్లీ బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు, మార్గ మధ్యంలో బైక్‌లో సమస్యల కారణంగా, అది రోడ్డుపై నిలిచిపోతే మెకానిక్ కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా, ఇప్పుడు తమ వినియోగదారుల కోసం ఓ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది.
ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన హ్యార్లీ డేవిడ్‌సన్ 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను కంపెనీ ఇప్పుడు భారత్‌లో కూడా ప్రారంభించింది. భారతీయ రోడ్లపై ఎప్పుడైనా, ఎక్కడైనా మీ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లో సమస్యలు తలెత్తినట్లయితే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. దేశంలోని 9 అధీకృత హ్యార్లీ డేవిడ్‌సన్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ కంపెనీ మ్యాప్‌ఫ్రే అసిస్టెన్స్‌కు చెందిన 100 శాతం పూర్తి భారతీయ అనుబంధ సంస్థ ఇండియా అసిస్టెన్స్ సహాకరంతో హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ సేవలను ప్రారంభించింది. ఇండియా అసిస్టెన్స్ బృందం సాయంతో, తాము ఇప్పుడు ముఖ్యమైన సేవలను, 24x7 సపోర్ట్ మరియు తమ ఉత్పత్తులను సురక్షితంగా, సౌకర్యవంతంగా తరలించే ట్రక్కులు వంటి సదుపాయలను అందించగలుగుతున్నామని, ఈ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ తమ వినియోగదారులకు భద్రత మరియు సౌకర్యాలను కల్పిస్తుందని హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ తెలిపారు.



Click it and Unblock the Notifications








