హ్యార్లీ డేవిడ్‌సన్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు
అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్ గురించి బైక్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శతాబ్ధానికి పైగా చరిత్ర కలిగిన ఈ మోటార్‌సైకిల్ కంపెనీ ప్రపంచ మోటార్‌సైకిల్ విభాగంలో సరికొత్త విప్లవాలకు నాంది పలికింది. హ్యార్లీ డేవిడ్‌సన్ ఇటీవలే 110 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఈ 110 ఏళ్ల హ్యార్లీ డేవిడ్‌సన్ చరిత్రను ఓసారి తిరగేద్దాం రండి..!
హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీను 1904వ సంవత్సరంలో విలియమ్ ఎస్ హ్యార్లీ మరియు ఆర్థర్ డేవిడ్‌సన్‌లు స్థాపించారు. ఈ సంస్థ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో ప్రచురించడమైనది. హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలేంటో ఈ ఫోటో ఫీచర్‌లో చూద్దాం రండి..!

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో ప్రచురించడమైనది. ఈ మోటార్‌సైకిల్ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలేంటో ఈ ఫోటో ఫీచర్‌లో చూద్దాం రండి..!

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ కంపెనీకు నాంది పలికింది 21 ఏళ్ల విలియమ్ ఎస్ హ్యార్లీ. సైకిల్ ఫ్రేమ్‌లో అమరే ఇంజన్‌కు ఈయన బ్లూప్రింట్ తయారు చేయటం దగ్గర నుండి ఈ కంపెనీ ప్రారంభమైంది. విలియం ఎస్ హ్యార్లీ, ఆర్థర్ డేవిడ్‌సన్‌లు భాగస్వాములుగా ఏర్పడి 1904లో హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ కంపెనీను ప్రారంభించారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నదే హ్యార్లీ డేవిడ్‌సన్ మొట్టమొదటి ఫ్యాక్టరీ. 1904వ సంవత్సరంలో 10 x 15 అడుగులు విస్తీర్ణంలో చక్కలతో చేయబడిన ఫ్యాక్టరీలో తమ తొలి బైక్‌కు వీరిద్దరూ ప్రాణం పోశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఉన్న మిల్వాకీకు చెందిన హెన్రీ మేయర్ తొలి హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలు చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
అమెరికాలోని చికాగోలో సి.హెచ్. లాంగ్ తొలి హ్యార్లీ డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌ను ప్రారంభించాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ 1905లో బైక్ రేస్‌లో పాల్గొని విజయం సాధించింది. ఈ విజయంతో హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్ మంచి పాపులారిటీ దక్కించుకుని, కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ 1906వ సంవత్సరంలో 6 మంది వర్కర్లతో ఓ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో కంపెనీ క్యాటలాగ్‌ను కూడా విడుదల చేసింది. 1910లో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ ఫుల్ టైమ్ ఉద్యోగులను నియమించుకుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను రైడ్ చేసిన మొట్టమొదటి మహిళ జనెట్ డేవిడ్‌సన్. ఈమె ఆర్థర్ డేవిడ్‌సన్ అత్త. ఈమె హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లపై బ్రాండ్ పేరును వ్రాయటం, పిన్ స్ట్రిప్పింగ్ చేయటంలో సాయం చేస్తుండేంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ 1909వ సంవత్సరంలో తొలి వి-ట్విన్ ఇంజన్ కలిగి మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అప్పట్లో ఈ ఇంజన్ గరిష్టంగా 7 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసేది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన కొద్ది సంవత్సరాల్లోనే కల్ట్ క్లాసిక్స్‌గా మారిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫోర్బ్స్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు మాల్కోమ్ ఫోర్బ్స్ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు పెద్ద అభిమాని. ఈయన వద్ద సుమారు 50కు పైగా హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు ఉన్నాయి. అంతేకాదు, ఈయన అనేక హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను తన స్నేహితులకు బహుమతిగా ఇచ్చారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ తొలిసారిగా అమెరికాకు వెలుపలి వైపు 1998 సంవత్సరంలో మొట్టమొదటి అసెంబ్లింగ్ కేంద్రాన్ని బ్రెజిల్‌లో ఏర్పాటు చేసింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లలో అత్యంత ఖరీదైన మోడల్ 'సివివో ఆల్ట్రా క్లాసిక్ ఎలక్ట్రా గ్లైడ్'. దీని ధర 40,000 అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు).

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న కొన్ని పాపురల్ మోడళ్లను చూడండి.

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ 883 రోడ్‌స్టర్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ ఐరన్ 883

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ ఫోర్టీ ఎయిట్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ సూపర్‌లో

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ నైట్ రాడ్ సెప్షల్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ రోడ్ కింగ్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్

హ్యార్లీ డేవిడ్‌సన్ సత్యాలు
హ్యార్లీ డేవిడ్‌సన్ సూపర్ గ్లైడ్


Click it and Unblock the Notifications








