500సీసీ బైక్‌ను విడుదల చేయనున్న హ్యార్లీ డేవిడ్‌సన్
అమెరికన్ ద్విచక్ర వాహన దిగ్గజం 'హ్యార్లీ డేవిడ్‌సన్', భారత మార్కెట్లో ఓ తక్కువ ధర కలిగిన బైక్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 500సీసీ ఇంజన్ సామర్థ్యానికి దిగువన ఓ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టాలని హ్యార్లీ డేవిడ్‌సన్ యోచిస్తోంది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే ఈ బడ్జెట్ స్పోర్ట్స్ బైక్‌ను ఉత్తర భారతదేశంలో టెస్టింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ రెగ్యులర్ టెస్టింగ్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని, ఉత్పత్తి దశకు చేరువలో ఉందని కూడా సమాచారం.
హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి రానున్న సబ్ 500-సీసీ మోటార్‌సైకిల్ ధర రూ.4 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల రాయల్టీని పరిగణలోకి తీసుకుంటే, ఇది అత్యంత చవకైనదనే చెప్పొచ్చు. ఈ బైక్‌లో 500సీసీ లేదా అంతకన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 45 బిహెచ్‌పిల పవర్‌ను, 50ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ ధరను తక్కువగా ఉంచేందుకు గాను, దీనిని స్థానికంగానే ఉత్పత్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు సికెడి రూట్లో భారత్‌కు దిగమతి అవుతుంటే, ఈ చవక బైక్‌ను మాత్రం భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








