మహిళా రైడర్లను టార్గెట్ చేస్తున్న హ్యార్లీ డేవిడ్‌సన్

ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు నడిపే మహిళలు ఎక్కువగా ఉన్నారని, ఒకప్పుడు తాను ఈ బైక్‌లను రైడ్ చేసేటప్పుడు వీరి సంఖ్య చాలా అరుదుగా ఉండేదని, ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయిందని హ్యార్లీ డేవిడ్‌సన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు విలియండ్ డేవిడ్‌సన్ మునిమనవరాలు, హ్యార్లీ డేవిడ్‌సన్ క్రియేటివ్ డైరెక్టర్ కరెన్ డేవిడ్‌సన్ చెప్పారు.
అమెరికాలో అమ్ముడవుతున్న హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ కొనుగోలుదారులలో కాలు భాగం మహిళలే ఉన్నారని, తమ బ్రాండ్ న్యూ బైక్‌లలో 12 శాతం మహిళలకే విక్రయిస్తున్నామని కరెన్ డేవిడ్‌సన్ చెప్పారు. కాగా.. హ్యార్లీ డేవిడ్‌సన్ సంస్థను స్థాపించి 110 సంవత్సరాలు పూర్తి కావటంతో, ఈ వేడుకను జరుపుకునేందుకు ఆమె గోవా విచ్చేశారు.
నేటి ఆధునిక మహిళలు ఎన్నో రంగాల్లోకి ప్రవేశిస్తున్నారని, అలాంటప్పుడు ఇలాంటి అందమైన మోటార్‌సైకిళ్లను ఎందుకు కొనుగోలు చేయకూడదని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా, తను హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను నడిపేందుకు తన ఇద్దరు అన్నలతో సరదాగా పోట్లాడే విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈమె ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హ్యార్లీ డేవిడ్‌సన్ యజమానులను కలిసి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి, తమ ఉత్పత్తులను మరింత మెరుపరచేందుకు సదరు ఫీడ్‌బ్యాక్‌ను ఉపయోగిస్తుంటుంది.


Click it and Unblock the Notifications








