హీరో మోటోకార్ప్ నుంచి ఓ కొత్త 250సీసీ మోటార్‌సైకిల్
స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్.. దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం బైక్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్ కన్నా మరింత మెరుగైన ఓ 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను కస్టమర్లకు పరిచయం చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరగనున్న 2014 ఇండియా ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ ఈ కొత్త 250సీసీ బైక్‌ను విడుదల చేయనుంది.
హీరో మోటోకార్ప్ నుంచి రానున్న ఈ కొత్త 250సీసీ బైక్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దీనిని అమెరికాకు చెందిన తమ సాంకేతిక భాగస్వామి 'ఎరిక్ బ్యూయెల్ రేసింగ్' (ఈబిఆర్)తో కలిసి హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. మోటార్‌స్పోర్ట్, రేసింగ్‌లో మంచి ప్రాచుర్యాన్ని పొంది ఈబిఆర్, హీరో మోటోకార్ప్ సంస్థకు పెద్ద అసెట్‌గా మారనుంది.

ఈబిఆర్ సాయంతో హీరో మోటోకార్ప్ తమ ఆర్ అండ్ డి కేంద్రాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. హీరో మోటోకార్ప్ నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త 2014 కరిజ్మా, కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడళ్లలో కూడా ఈబిఆర్ సాంకేతికతలు కనిపించనున్నాయి. అయితే, హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ, డిజైన్‌లతో రానున్న కొత్త 250సీసీ బైక్ పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
హీరో మోటోకార్ప్ ఇప్పటికే గుర్గావ్, డెహ్రడూన్‌లలో ఉండే తమ ఆర్ అండ్ డి కేంద్రాల నుంచి మంచి నైపుణ్యం కలిగిన కొందరు యువ ఇంజనీర్ల బృందాన్ని అమెరికాలోని విస్కాన్సిల్‌లో ఈస్ట్ ట్రోయ్ వద్ద ఉన్న ఈబిఆర్ రీసెర్చ్ సెంటర్‌కు పంపించింది. ఇటు భారత మార్కెట్‌తో పాటుగా అటు గ్లోబల్ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకొని ఓ కొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను ఇరు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే, వచ్చే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే..!


Click it and Unblock the Notifications








