అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించిన హీరో మోటోకార్ప్

ఇందులో భాగంగానే తాజాగా గౌటెమాలా, ఎల్ సల్వడర్, హోండ్యూరాస్ వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయటం ప్రారంభించింది. అక్కడి మార్కెట్లో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు గాను 'ఇండీ మోటోస్'ను స్థానిక భాగస్వామిగా నియమించుకున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. అమెరికాలో ఇండీ మోటోస్ హీరో మోటోకార్ప్‌కు అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించనుంది.
హీరో మోటోకార్ప్ తమ మాస్ మార్కెట్ మోటార్‌సైకిళ్లు హెచ్ఎఫ్ డాన్, స్ప్లెండర్ ఎన్‌ఎక్స్‌జి, సూపర్ స్పెండర్, గ్లామర్ మరియు అచీవర్ మోడళ్లతో పాటుగా హంక్, కరిజ్మా వంటి ప్రీమియం మోడళ్లను కూడా ఎగుమతి చేస్తుంది. హీరో మోటోకార్ప్ ఇప్పటికే బంగ్లాదేష్, నేపాల్, కొలంబియా, శ్రీలంక దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








