హీరో స్ప్లెండర్ ప్రో గోల్డ్ స్పెషల్ ఎడిషన్ బైక్ విడుదల

By Ravi

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ (అమ్మకాల పరంగా) హీరో మోటోకార్ప్ నుంచి దేశీయ విపణిలో అత్యధికంగా అమ్మడవుతున్న కమ్యూటర్ మోటార్‌సైకిల్ 'స్ప్లెండర్ ప్రో'లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హీరో స్ప్లెండర్ ప్రో గోల్డ్ ఎడిషన్‌ పేరుతో లభ్యమవుతున్న ఈ బైక్ సాధారణ స్ప్లెండర్ ప్రో బైక్‌తో పోల్చుకుంటే మరింత ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌ను, గోల్డ్ కలర్ పెయింట్ జాబ్‌ను కలిగి ఉంటుంది.

స్ప్లెండర్ బైక్‌ను కంపెనీ తొలిసారిగా 1993వ సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ విడుదలై దాదాపు 20 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో, ఈ సందర్భాన్ని హీరో మోటోకార్ప్ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ గోల్డ్ ఎడిషన్ స్ప్లెండర్ ప్రో బైక్ హెడ్‌లైడ్ పైభాగం మరియు బాడీపై 'స్పెషల్ ఎడిషన్' స్టిక్కర్లను అంటించారు. అయితే, ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు.

Splendor Pro Gold Edition

ఆకర్షనీయమైన కొత్త బాడీ గ్రాఫిక్స్, పవర్ స్టార్ట్, కొత్త స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, స్టయిలిష్ మీటర్ కన్సోల్ ఈ స్ప్లెండర్ ప్రో బైక్ ప్రత్యేకతలు. ఇందులో 97.2సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7.8 పిఎస్‌ల శక్తిని, 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్ప్లెండర్ ప్లస్ గోల్డ్ ఎడిషన్ బైక్ ధర రూ.49,000 (ఎక్స్-షోరూమ్)లుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. సాధారణ వెర్షన్ స్ప్లెండర్ ప్లస్‌ బైక్‌తో పోల్చుకుంటే దీని ధర దాదాపు రూ.1,000 అధికంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా, కంపెనీ అందిస్తున్న అన్ని ద్విచక్ర వాహనాలపై వారంటీని 5 ఏళ్లు లేదా 70,000 కి.మీ. (ఏది ముందు ముగిస్తే అది)లకు పొడగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గతంలో ఇది కేవలం 2 ఏళ్లు లేదా 30,000 కి.మీ. మాత్రమే ఉండేది. దీంతో దేశంలో ద్విచక్ర వాహనాలపై 5 ఏళ్ల వారంటీని అందిస్తున్న ఏకైక సంస్థ హీరో మోటోకార్ప్ నిలిచింది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 16, 2013, 15:31 [IST]
English summary
Splendor, an icon of the motorcycle world, was launched back in 1993 by Hero Honda. On occasion of completing twenty extremely successful years Hero has launched a special Gold Edition of Splendor Plus. The Gold Edition gets the "Special Edition" sticker over the headlight and on the sides. The bike is also available in a new Gold colour.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+