హీరో బైక్‌లకు స్వంత ఫైనాన్సింగ్, మే సేల్స్ అదుర్స్

By Ravi

ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోనూ హీరో మోటోకార్ప్ ప్రోత్సాహకర అమ్మకాలను సాధించింది. గడచి మే నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. మే 2012 నెల అమ్మకాలతో పోల్చుకుంటే మే 2013 నెల అమ్మకాలు 3 శాతం వృద్ధి చెందాయి. ఈ కాలానికి కంపెనీ మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5,56,644 యూనిట్ల నుంచి 5,57,890 యూనిట్లకు పెరిగాయి. ఏప్రిల్, మే 2013 ఈ రెండు నెలల్లో మొత్తం 11 లక్షల టూవీలర్లను విక్రయించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు.

ఆదుకున్న ఐదేళ్ల వారంటీ
హీరో మోటోకార్ప్ తాజాగా ప్రవేశపెట్టిన ఐదేళ్ల వారంటీ స్కీమ్ కూడా కంపెనీ అమ్మకాలు పెరగడటంలో దోహదపడింది. హీరో మోటోకార్ప్ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారికి కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది. మోటార్‌సైకిళ్లు 70,000 కి.మీ. లేదా ఐదేళ్లు అలాగే స్కూటర్లు 50,000 కి.మీ. లేదా ఐదేళ్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని కంపెనీ అందిస్తోంది.

హీరోఫిన్ కార్ప్ - రీటైల్ ఫైనాన్స్ యూనిట్
ఫైనాన్స్ ద్వారా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకు వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు హీరో మోటోకార్ప్ కొత్తగా రీటెయిల్ ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేసింగి. హీరోఫిన్‌ కార్ప్ పేరుతో న్యూఢిల్లీలో ఓ సంస్థను కంపెనీ ప్రారంభించింది. త్వరలోనే దీన్ని నేషనల్‌ క్యాపిటల్ రీజియన్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రారంభంలో భాగంగా, హీరోఫిన్‌ కార్ప్‌ను దేశవ్యాప్తంగా 200 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచాలని హీరో మోటోకార్ప్ నిర్ణయించింది.

Hero MotoCorp

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2013, 10:55 [IST]
English summary
Hero MotoCorp 's total sales in May rose 0.2 percent year-on-year to 5.58 lakh units, the India's largest two-wheeler maker said on Monday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+