అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించిన హీరో మోటోకార్ప్

By Ravi

Hero Sales
హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించింది. గడచిన నెలలో కంపెనీ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జనవరి 2013 నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 7.21 శాతం వృద్ధిని సాధించి 5,57,797 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే నెలలో మొత్తం అమ్మకాలు 5,20,272 యూనిట్లుగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన సంవత్సరంలో నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డు (5,56,644 యూనిట్లు) నమోదయ్యిందని, ఆ తర్వాత ఇంత గరిష్ట మొత్తంలో అమ్మకాలు నమోదు కావటం ఇదే మొదటిసారి అని కంపెనీ తెలిపింది. తాము ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఇగ్నైటర్‌, ప్యాషన్‌ ఎక్స్‌‌ప్రో మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆధరణ లభించిందని, దీంతో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని హీరో మోటోకార్ప్ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) అనిల్‌ దువా తెలిపారు.

ఇదే సమయంలో ప్లెజర్‌, మ్యాస్ట్రో స్కూటర్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిందని ఆయన అన్నారు. మొత్తమ్మీద చూసుకుంటే, భారతద్విచక్ర వాహన రంగం అంకెల పరంగా మంచి పురోగతిని సాధించిందని, భవిష్యత్తులో కూడా తాము ఇదే పరపతిని కొనసాగిస్తామని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత నెలలో రాజస్థాన్‌లోని నీమ్రానాలో గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ (జిపిసి) నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ.550 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, February 4, 2013, 10:04 [IST]
English summary
Two-wheeler manufacturer Hero MotoCorp on Sunday said it has recorded highest monthly sales of 5,57,797 units in January 2013. This is a growth of 7.21 per cent from 5,20,272 units sold in same month of 2012, Hero MotoCorp said in a statement. The previous highest sales was in May 2012, when the company had sold 5,56,644 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+