తొలి త్రైమాసికంలో 11 శాతం నష్టాలను చవిచూసిన 'హీరో'
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ లభాలు క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ నికర లాభం సుమారు 11 శాతం క్షీణించి రూ.549 కోట్లుగా నమోదైందని, ఇందుకు ప్రధాన కారణం హరిద్వార్ ప్లాంటుపై అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం, అమ్మకాలు తగ్గుముఖం పట్టడమేమనని కంపెనీ పేర్కొంది.
గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.615 కోట్లుగా ఉంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా స్వల్పంగా తగ్గింది. ఇది రూ.6,208 కోట్ల నుంచి రూ.6,127 కోట్లకు తగ్గి 1.30 శాతం క్షీణతను నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 5 శాతం తగ్గి 16,42,292 యూనిట్ల నుంచి 15,59,282 యూనిట్లకు పడిపోయాయని కంపెనీ పేర్కొంది. హరిద్వార్‌లోని ప్లాంటుకు అయిదేళ్ల పాటు లభించిన రాయితీ గడువు తీరిపోవడంతో తొలి త్రైమాసికంలో అధిక పన్ను రేటు చెల్లించాల్సి వచ్చిందని, అంతకు ముందు త్రైమాసికంలో 16.3 శాతంగా ఉన్న పన్ను భారం తొలి త్రైమాసికంలో 26.9 శాతానికి పెరిగిందని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ తెలిపారు.
వేసవిలో అమ్మాకుల జోరుగానే సాగినప్పటికీ, జూన్ నెలలో సంభవించిన భారీ వర్షాల కారణంగా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. అయితే, రానున్న రోజుల్లో సరికొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా మూడవ త్రైమాసికం నుంచి పరిస్థితులు మెరుగుపడుతాయని ముంజాల్ వ్యాఖ్యానించారు.



Click it and Unblock the Notifications








