ఆఫ్రికా మార్కెట్లోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్

By Ravi

Hero MotoCorp
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా తాజాగా ఆఫ్రికా మార్కెట్లో ప్రవేశించింది. ఇందులో భాగంగా, కెన్యాలో తమ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించినట్లు హీరో మోటోకార్ప్ (హెచ్‌ఎమ్‌సి) ఓ ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్పత్తులను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అక్కడి మార్కెట్లలో విక్రయించనున్నారు.

అంతర్జాతీయ విస్తరణలో భాగంగా ఆఫ్రికా ఖండంలో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టామని, కెన్యాలో ఒక అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొంది. ఆఫ్రికాలోని బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్‌ల్లో కూడా వచ్చే వారం నుంచి తమ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించనుందని, హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు.

కాగా.. హీరో మోటోకార్ప్ ఇటీవలే అమెరికా మార్కెట్లోకి కూడా ప్రవేశించి కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసినదే. గౌటెమాలా, ఎల్ సల్వడర్, హోండ్యూరాస్ వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు గాను 'ఇండీ మోటోస్'ను స్థానిక భాగస్వామిగా నియమించుకున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది.

అమెరికాలో ఇండీ మోటోస్, హీరో మోటోకార్ప్‌కు అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించనుంది. హీరో మోటోకార్ప్ తమ మాస్ మార్కెట్ మోటార్‌సైకిళ్లు హెచ్ఎఫ్ డాన్, స్ప్లెండర్ ఎన్‌ఎక్స్‌జి, సూపర్ స్పెండర్, గ్లామర్ మరియు అచీవర్ మోడళ్లతో పాటుగా హంక్, కరిజ్మా వంటి ప్రీమియం మోడళ్లను కూడా ఎగుమతి చేస్తుంది. హీరో మోటోకార్ప్ ఇప్పటికే బంగ్లాదేష్, నేపాల్, కొలంబియా, శ్రీలంక దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Sunday, July 7, 2013, 10:15 [IST]
English summary
Hero MotoCorp has launched its range of two-wheelers in the African continent under the ‘Hero’ badge. Hero MotoCorp has also setup its international assembly plant in Kenya with operations slated to commence in Burkina Faso and Ivory Coast next week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+