2014లో అమెరికా మార్కెట్లో ప్రవేశించనున్న హీరో మోటోకార్ప్

By Ravi

ఇటీవల ఫ్లోరిడాలోని ఆర్లాండోలో జరిగిన అమెరికన్ ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్ ఎక్స్‌పో (ఎయిఎమ్ఎక్స్‌పో)లో భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ అమెరికన్ భాగస్వామి అయిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్) ఏ విషయాన్నైతే వెల్లడించిందో, అదే విషయాన్ని ప్రస్తుతం హీరో మోటోకార్ప్ కూడా ధృవీకరించింది. అంతకీ ఆ విషయం ఏంటంటే, హీరో మోటోకార్ప్ అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించడం గురించి.

హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. 2014 ఆరంభంలో అమెరికా రాష్ట్రాలు, కెనడాలలో తమ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభిస్తామని చెప్పారు. గడచిన అక్టోబర్ నెలలో అమెరికాలో జరిగిన ఎయిమ్ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడళ్లను అమెరికన్లకు పరిచయం చేసింది. ఇందులో కొత్త కరిజ్మా జెడ్ఎమ్ఆ్స హంక్, హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో, స్ప్లెండర్ ప్రో, ప్లెజర్ స్కూటర్లు ఉన్నాయి.

Hero MotoCorp

అమెరికాలో ప్రదర్శించబడిన అప్‌గ్రేడెడ్ హీరో మోటోకార్ప్ ఉత్పత్తులను చూసిన అక్కడి ప్రజలు, కంపెనీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, అక్కడి మార్కెట్లో హీరో మోటోకార్ప్ ప్రవేశపెట్టనున్న ఖచ్ఛితమైన ఉత్పత్తుల గురించి ఇంకా వివారలు తెలియాల్సి ఉంది. ఉత్తర అమెరికాలో హీరో కార్యకలాపాలను ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ కంపెనీ నిర్వహించనుంది.

వాస్తవానికి ఉత్తర అమెరికాలో అధిక ఇంజన్ సీసీ కలిగిన బైక్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అయితే, పవన్ ముంజాల్ మాత్రం 100సీసీ నుంచి 250సీసీ మధ్యలోని బైక్‌లకు కూడా మంచి డిమాండ్ ఉండే ఆస్కారం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హీరో మోటోకార్ప్ ఇప్పటికే దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు మరికొన్ని పొరుగు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 16, 2013, 9:56 [IST]
English summary
What Erik Buell Racing announced during the American International Motorcycle Expo (AIMExpo) in Orlando, Florida through a press release has been once again confirmed. This time by Pawan Munjal, MD and CEO of Hero MotoCorp. The Indian two wheeler manufacturer will begin start selling its products in the United States and Canada from early 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+