హీరో స్ప్లెండర్ గోల్డ్ ఎడిషన్; అన్ని మోడళ్లపై 5 ఏళ్ల వారంటీ
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) అందిస్తున్న అన్ని ద్విచక్ర వాహన మోడళ్లపై ఇప్పుడు ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది. హీరో నుంచి అత్యంత పాపులర్ అయిన కమ్యూటర్ బైక్ స్ప్లెండర్ ఇప్పుడు ప్రత్యేక గోల్డ్ ఎడిషన్‌లో కూడా లభిస్తుంది.
గతంలో కంపెనీ అందిస్తున్న ద్విచక్ర వాహనాలపై వారంటీ కేవలం 2 ఏళ్లు లేదా 30,000 కి.మీ. మాత్రమే ఉండగా, కంపెనీ ఇప్పుడు దానిని 5 ఏళ్లు లేదా 70,000 కి.మీ. (ఏది ముందు ముగిస్తే అది)లకు పొడగించింది. ఈ అదనపు వారంటీతో హీరో మోటోకార్ప్ అందిస్తున్న ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరింత జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, గడచిన 1993వ సంవత్సరంలో హీరో హోండా విడుదల చేసిన ఐకానిక్ మోటార్‌సైకిల్ స్ప్లెండర్, మార్కెట్లోకి ప్రవేశించి 20 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో, ఈ సందర్భాన్ని హీరో మోటోకార్ప్ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. గోల్డ్ ఎడిషన్ పేరుతో వస్తున్న ఈ స్ప్లెండర్ ప్లస్ హెడ్‌లైడ్ పైభాగం మరియు బాడీపై 'స్పెషల్ ఎడిషన్' స్టిక్కర్లను జోడించారు.
అంతేకాకుండా ఈ బైక్ కొత్త గోల్డ్ కలర్ ఆఫ్షన్‌తో కూడా లభ్యమవుతుంది. అయితే, ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. కొత్త స్ప్లెండర్ ప్లస్ గోల్డ్ ఎడిషన్ బైక్ ధర రూ.49,000 (ఎక్స్-షోరూమ్)లుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. సాధారణ వెర్షన్ స్ప్లెండర్ ప్లస్ బైక్‌తో పోల్చుకుంటే దీని ధర దాదాపు రూ.1,000 అధికంగా ఉంటుంది. మరి ఈ కొత్త స్ప్లెండర్ ప్లస్ గోల్డ్ ఎడిషన్‌ను సొంతం చేసుకునేందుకు మీరు సిద్ధమేనా..?


Click it and Unblock the Notifications








