కర్ణాటకలో రెండవ ప్లాంట్‌ను ప్రారంభించిన హోండా

By Ravi

Honda CB150R
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్‌ యొక్క పూర్తి భారతీయ అనుబంధ సంస్థ "హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా" (హెచ్ఎమ్ఎస్ఐ) కర్ణాటక రాష్ట్రంలో తమ రెండవ ప్లాంటును ప్రారంభించింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న నర్సాపూర్ ప్రాంతంలో కంపెనీ అత్యంత అధునాతన తయారీ కేంద్రాన్ని నిర్మించింది. హెచ్ఎమ్ఎస్ఐకు ఇది భారత్‌లో మూడవ ప్లాంట్ కావటం విశేషం.

కొత్త ప్లాంట్ ప్రారంభం కావటంతో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అందిస్తున్న కొన్ని ద్విచక్ర వాహనాల వెయింటింగ్ పీరియడ్ భారీగా తగ్గనుంది. హెచ్ఎమ్ఎస్ఐకు ఇప్పటికే మానేసర్, తపుకరా లలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. తాజాగా నర్సాపూర్ ప్లాంట్ ఏర్పాటుతో 2014 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 64 శాతం మేర పెరగనుంది.

దాదాపు 96 ఎకరాల విస్తీర్ణంలో కర్ణాటక రాజధాని బెంగుళూరు నుంచి సుమారు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు ఏర్పాటు కంపెనీ 1350 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఈ ప్లాంటులో దాదాపు 4500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జూన్ నెల నుంచి నర్సాపూర్ ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి పనులు ప్రారంభం కానున్నాయి.

తొలి విడతలో భాగంగా ఈ ప్లాంటులో సాలీనా 12 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు. రెండవ విడతలో ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధనంగా మరో 6 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ప్లాంటులో సాలీనా 18 లక్షల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు.

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI), the 2nd largest 2Wheeler company in India inaugurated its most advanced and latest third 2Wheeler production plant at Narsapura Area, District Kolar (Karnataka) today.
Story first published: Tuesday, May 28, 2013, 18:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X