హోండా నుంచి మరొక సరికొత్త స్కూటర్ వస్తోంది!

By Ravi

ఇటీవలి కాలంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో చాలా చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపనీస్ టూవీలర్ దిగ్గజం 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా', కేవలం మోటార్‌సైకిల్ విభాగంపైనే కాకుండా, స్కూటర్ విభాగంపై కూడా దృష్టి సారిస్తోంది. తాజాగా యాక్టివా-ఐ స్కూటర్‌ను ప్రవేశపెట్టిన హోండా, ఇప్పుడు మరొక సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఓ ఇంటర్నెట్ రిపోర్ట్ ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో కొత్త హోండా స్కూటర్ విడుదల కానున్నట్ల సమాచారం. కె24ఏ అనే కోడ్‌నేమ్‌తో ఈ ఆటోమేటిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్నారు. అయితే, ఈ కొత్త స్కూటర్‌లో సరికొత్త ఇంజన్‌కు బదులుగా ప్రస్తుతం హోండా అందిస్తున్న హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ)తో కూడిన 109సీసీ ఇంజన్‌ (యాక్టివాలో ఉపయోగిస్తున్న ఇంజన్)నే అమర్చనున్నట్లు తెలుస్తోంది.

Activa I

హోండా నుంచి రానున్న కొత్త స్కూటర్ కూడా లీటర్ పెట్రోల్‌కు 60 కి.మీ. మైలేజీని ఆఫర్ చేయనుంది. ఈ కొత్త స్కూటర్‌ను హోండా మానేసర్ ప్లాంట్‌లో పరిమిత సంఖ్యలో ఉత్పత్తి (నెలకు 700 యూనిట్లు) చేయనున్నారు. అనంతరం ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా లక్ష యూనిట్లకు పెంచుతారు. ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్‌ను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే హోండా ప్రధమ లక్ష్యం. ఆ దిశలో భాగంగానే ఈ కొత్త స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 13, 2013, 17:38 [IST]
English summary
Honda Motorcycle & Scooter India has been pretty active in the commuter motorcycle segment lately. That does not mean the company is not concentrating on the lucrative automatic scooter market. In fact, a new model is likely to join its already abundant scooter lineup.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+