హోండా 'డ్రీమ్' మ్యాజిక్: బజాజ్‌ ఆటోను ఓవర్‌టేక్

By Ravi

హోండా సేల్స్ 20 శాతం వృద్ధి
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, తన 13 ఏళ్ల భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. అంతేకాదు, ద్విచక్ర వాహన సెగ్మెంట్లో మొట్టమొదటి సారిగా ద్వితీయ స్థానంలో ఉన్న బజాజ్ ఆటో కంపెనీని ఓవర్‌టేక్ చేసి ఆ స్థానాన్ని హోండా కైవసం చేసుకుంది. గడచిన జులై నెలలో హోండా మొత్తం 2,87,177 ద్విచక్ర వాహనాలను (ఎగుమతులతో కలిపి) విక్రయించింది.

జులై 2012లో 2,39,094 యూనిట్లగా ఉన్న కంపెనీ అమ్మకాలు జులై 2013లో 2,87,177 యూనిట్లుగా నమోదయ్యి 20 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇందులో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 1,47,635 యూనిట్లుగా ఉండగా, స్కూటర్ల అమ్మకాలు 1,39,542 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన డ్రీమ్ సిరీస్ బడ్జెట్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ జోరందుకోవటంతో కంపెనీ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.


బజాజ్ సేల్స్ 20 శాతం క్షీణత
కాగా.. ఇదే సమయంలో బజాజ్ ఆటో ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. జులై 2012లో 3,08,858 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించిన కంపెనీ గడచిన నెలలో కేవలం 2,46,828 యూనిట్ల ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై 2013 కాలంలో కంపెనీ మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11,06,979 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Bajaj Discover 125ST

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2013, 17:01 [IST]
English summary
Honda Motorcycle and Scooter India (HMSI) has registerd sales of 2,87,177 (including exports) motorcycles and scooters in the month of July 2013. HMSI has not only registered its best ever monthly sales till date, but has surpassed Bajaj Auto to become the second largest two-wheeler manufacturer in the Indian two-wheeler industry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+