హోండా నుంచి రానున్న సరికొత్త 150సీసీ బైక్

By Ravi

Honda Bike
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో ఓ సరికొత్త 150సీసీ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. బజాజ్ పల్సర్ 150, హీరో హంక్, యమహా ఎఫ్‌జెడ్ వంటి మోటార్‌సైకిళ్లకు గట్టి సవాల్ విసురుతూ ఓ పెర్ఫామెన్స్ వెర్షన్ 150సీసీ బైక్‌ను హోండా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం హోండా యునికార్న్, డాజ్లర్ మోడళ్లను విక్రయిస్తోంది.

హోండా తాజాగా సిబిఆర్ సిరీస్‌లో విడుదల చేసిన 150సీసీ బైక్ ధర పరంగా కాస్తంత అధికంగా ఉండటంతో ఈ మోడల్ బడ్జెట్ పెర్ఫామెన్స్ బైక్ ప్రియులకు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, సరసమైన ధరకే సరికొత్త పవర్‌ఫుల్, స్టయిలిష్ 150సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని హోండా యోచిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం హోండా ఈ కొత్త బైక్‌ను, భారత్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ డెవల్‌మెంట్ (ఆర్ అండ్ డి) కేంద్రంలో అభివృద్ధి చేస్తోంది.

హోండా ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన తమ స్కూటర్లను విడుదల చేస్తూ, ప్రతి సంవత్సరం కనీసం నాలుగు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తామని, అలాగే ఈ సంవత్సరంలో కూడా కొత్తగా నాలుగు ఉత్పత్తులను విడుదల చేస్తామని, అందులో మొదటి ఉత్పత్తి (బహుశా ఈ కొత్త 150సీసీ బైక్ కావచ్చు)ని ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. హోండా అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త 150సీసీ బైక్ ఏప్రిల్-జూన్ 2013 త్రైమాసికంలో మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, January 24, 2013, 11:13 [IST]
English summary
Honda Motorcycles and Scooter India is planning to launch a new 150cc motorcycle in the market. Honda's new 150cc motorcycle will be designed to compete fiercely against the likes of the Bajaj Pulsar 150, Hero Hunk and the Yamaha FZ16.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+