నేడు 100సీసీ బైక్‌ను ఆవిష్కరించనున్న హోండా
ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో బడ్జెట్ బైక్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న 'హీరో స్ప్లెండర్'ను ఢీకొట్టేందుకు హోండా సిద్ధమైంది. హీరో మోటోకార్ప్ నుంచి అత్యధికంగా అమ్మడవుతున్న ఈ బైక్‌ను సవాల్ చేస్తూ హోండా తమ సరికొత్త 100సీసీ బైక్‌ను నేడు (ఏప్రిల్ 17, 2013) ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. మాస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఓ సరికొత్త 100సీసీ బైక్‌ను పరిచయం చేయనుంది. ఈ మేరకు కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది (క్రింది ఫొటోలో గమనించవచ్చు).
'ఆ రహా హై యహా కా సూపర్‌స్టార్' (రాబోతుంది ఇక్కడి సూపర్‌స్టార్) అనే పేరుతో హోండా ఓ టీజర్‌ను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రస్తుతం హోండా అందిస్తున్న అత్యంత చవక బైక్ 'హోండా డ్రీమ్ యుగ'కు దిగువన ఈ కొత్త బడ్జెట్ బైక్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. హోండా తమ డ్రీమ్ యుగ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డ్రీమ్ సిరీస్‌లోనే అతితక్కువ ధరకకు ఈ బైక్‌ను విడుదల చేసింది. కె23 అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేసిన ఈ బడ్జెట్ బైక్ ఎక్కువ మైలేజ్‌ని ఆఫర్ చేస్తూ, ఈ సెగ్మెంట్లోని హీరో స్ప్లెండర్, బజాజ్ డిస్కవర్, స్టార్ సిటీ వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది.
డ్రీమ్ యుగ బైక్‌లో 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించగా, కొత్తగా రానున్న ఈ బడ్జెట్ బైక్‌లో 100సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. అధిక మైలేజీనిచ్చేలా హోండా ఇంజనీర్లు ఈ కొత్త 100సీసీ ఇంజన్‌ను ట్యూన్ చేయనున్నారు. ప్రస్తుతం దేశీయ విపణిలో హోండా డ్రీమ్ యుగ ధర రూ.45,101 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది హీరో స్ప్లెండర్ కన్నా రూ.2,850లు అధికం. దీన్నిబట్టి చూస్తుంటే, హోండా నుంచి కొత్తగా రానున్న బడ్జెట్ బైక్ హీరో స్ప్లెండర్ బైక్ ధర కన్నా చాలా తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








