జనవరి 22న భారత్‌లో 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' విడుదల

అమెరికాకు చెందిన పురాతన మోటార్‌‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌‌సైకిల్స్' (Indian Motorcycles) భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, వచ్చే నెల 22వ తేదీన ఇండియన్ మోటార్‌సైకిల్స్ దేశీయ విపణిలో తమ ఉత్పత్తులను విడుదల చేనున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు ఇండియన్ మోటార్‌సైకిల్ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది (క్రింది ఫొటోలో చూడొచ్చు). జనవరి 22, 2014న ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్ మోటార్‌సైకిళ్లను భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ కంపెనీ ఇటీవలే మూడు మోడళ్లను అమెరికాలో విడుదల చేసింది. వీటిలో ఓ సరికొత్త ఇంజన్‌ను ఉపయోగించారు.

Indian Motorcycles

వాస్తవానికి ఈ మూడు మోటార్‌సైకిళ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే, వీటి పేరును బట్టి ఇందులో ఆఫర్ చేసే ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. ఫలితంగా వీటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. అదే సరికొత్త థండర్ స్ట్రోక్ 111 క్యూబిక్ ఇంచ్ ఇంజన్. ఈ 1819సీసీ ఇంజన్ 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఒకప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్'ను 1901లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీదారైన, అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ 2011లో ఈ సంస్థను స్వాధీనం చేసుకుంది. పోలారిస్ చేతిలో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ మోటార్‍‌సైకిల్ బ్రాండ్ విక్టరీ కూడా ఉన్న సంగతి తెలిసినదే. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విక్టరీ మోటార్‌సైకిళ్లు కూడా భారత్‌కు రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2013, 17:15 [IST]
English summary
Indian Motorcycles, which revived its product lineup with a brand new engine and three new models earlier this year in the United States earlier, will make its official debut in India on 22nd January 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+