క్యాస్ట్రాల్ పవర్1 ఇంజన్ ఆయిల్‌ను విడుదల చేసిన జాన్ అబ్రహామ్

By Ravi

ప్రముఖ ఇంజన్ ఆయిల్ తయారీ సంస్థ క్యాస్ట్రాల్, ఫోర్ స్ట్రోక్ మోటార్‌సైకిళ్ల కోసం తమ పాపులర్ పవర్1 ఇంజన్ ఆయిల్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రముఖ బాలీవుడ నటుడు జాన్ అబ్రహామ్ చేతుల మీదుగా ఈ ఇంజన్ ఆయిల్‌ను విడుదల చేశారు.

డ్రాగ్‌ను తగ్గించి, ఆయిల్ వేగంగా ప్రవహించేలా ఈ క్యాస్ట్రాల్ పవర్1 ఇంజన్ ఆయిల్‌ను రూపొందించారు. దీని ఫలితంగా బైక్ పవర్, యాక్సిలరేషన్ మరింత పెరుగుతాయి. క్యాస్ట్రాల్ పవర్1 ఇప్పుడు కొత్త గోల్డ్, స్టార్ ప్యాక్‌‌లలో 1 లటర్, 900 మి.లీ. ప్యాకెట్లలో లభ్యమవుతాయి.

ఈ ఇంజన్ ఆయిల్ విడుదలతో పాటుగా, క్యాస్ట్రాల్ పవర్1 బ్రాండ్ అంబాసిడర్ మరియు స్వతహాగా బైక్ ప్రియుడైన జాన్ అబ్రహామ్ 'బైక్ ఆఫ్ ది ఇయర్ క్యాంపైన్'ను కూడా ప్రారంభించారు. ఈ క్యాంపైన్‌ను ఎక్స్‌బిహెచ్‌పి, క్యాస్ట్రాల్ పవర్1లు స్పాన్సర్ చేస్తున్నాయి.

John Abraham Unveils New Castrol Power1 Pack

ఎక్స్‌బిహెచ్‌పి, క్యాస్ట్రాల్ పవర్1 బైక్ ఆఫ్ ది ఇయర్ క్యాంపైన్‌తో అసోసియేట్ అవుతున్నందకు తనకెంతో గర్వంగా ఉందని, బైకింగ్ అంటే ప్యాషన్ మరియు పెర్ఫామెన్స్ అని, క్యాస్ట్రాల్ భారత్‌లో బైకింగ్‌ను ప్రోత్సహిస్తున్నందుకు, బైకర్ల ప్యాషన్‌ను గుర్తిస్తున్నందకు తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఎక్స్‌బిహెచ్‌పి, క్యాస్ట్రాల్ పవర్1లు స్పాన్సర్ చేస్తున్న బైక్ ఆఫ్ ది ఇయర్ క్యాంపైన్‌ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నిర్వహణలో ఉంది. ఇందు కోసం ఓటింగ్స్ సెప్టెంబర్ 15, 2013 వరకు ఓపెన్ చేయబడి ఉంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని https://boty.xbhp.com/ వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, August 31, 2013, 15:10 [IST]
English summary
Castrol Power1, a high performance engine oil for four stroke motorcycles was relaunched today by Castrol India, with Actor John Abraham unveiling the Castrol Power1 pack in Mumbai. Castrol Power1's unique power release formula is designed to make the oil flow faster and minimize drag, thus providing more power and superior acceleration at the touch of the throttle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+