భారత్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న కవాసకి జెడ్800 నేక్డ్ బైక్
భారత్‌లో ప్రీమియం బైక్‌లు గిరాకీ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తయారీదారులు కూడా సరికొత్త ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమ జెడ్1000 బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్న జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి, తాజాగా మరో కొత్త ఉత్పత్తిని కూడా విడుదల చేయనుంది.
కవాసకి జెడ్ సిరీస్‌లోనే జెడ్1000 బైక్‌కు దిగువన జె800 బైక్‌ను ప్రవేశపెట్టనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కవాసకి ఇప్పటికే తమ పూనే డీలర్‌షిప్‌లో ఈ కొత్త కవాసకి జె800 బైక్‌ను ప్రదర్శనకు ఉంచినట్లు తెలుస్తోంది. కవాసకి జెడ్800 నేక్డ్ బైక్ కూడా చూడటానికి జెడ్1000 మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండు బైక్‌ల స్టయిలింగ్ ఇంచు మించు ఒకేలా అనిపిస్తుంది.
ఇంజన్ విషయానికి వస్తే, కవాసకి జెడ్800 బైక్‌లో 806సీసీ లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,200 ఆర్‌పిఎమ్ వద్ద 113 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 83 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించి ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









