పెరిగిన కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ ధర
కెటిఎమ్ గడచిన జూన్ నెలలో కేవలం రూ.1.8 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్) తమ పవర్‌ఫుల్ '390 డ్యూక్' బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ధరకు తగిన విలువను ఆఫర్ చేసే కెటిఎమ్ 390 డ్యూక్ ఇప్పుడు కాస్తంత పెరిగింది.
ప్రస్తుతం కెటిఎమ్ 390 డ్యూక్ ధర 1.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది. పెరిగిన ధర కేవలం ఆరు వేల రూపాయలే కాబట్టి, లక్షలు పోసి ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారిపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది.
కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌లతో ఇది రేసింగ్, సిటీ, హైవే రైడ్‌ల కోసం చక్కగా సరిపోతుంది. భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం.
దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది.
ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం.


Click it and Unblock the Notifications








