మే 25న మార్కెట్లోకి రానున్న కెటిఎమ్ డ్యూక్ 390
బజాజ్-కెటిఎమ్ నుంచి ఓ సరికొత్త పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్ విడుదల కానున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇది వరకటి కథనాల్లో ప్రచురించి సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు 'కెటిఎమ్ డ్యూక్ 390' బైక్ విడుదల తేది ఖరారైంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈనెల 25న బజాజ్ ఆటో ఈ కొత్త బైక్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనుంది. బజాజ్ ఆటో ఇప్పటికే ఈ బైక్‌నుపూనేలోని తమ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.
కెటిఎమ్ డ్యూక్ 390 ధర రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో అందిస్తున్న కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌లో స్థానికంగా లభ్యమయ్యే టైర్లను ఉపయోగిస్తుండగా, ఈ వవర్‌ఫుల్ డ్యూక్ 390లో ఇంపోర్టెడ్ మెట్జ్లర్ టైర్లను అమర్చనున్నారు. ఈ పవర్‌ఫుల్ వెర్షన్ కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌లో మరింత మెరుగైన రోడ్ గ్రిప్ మరియు ఆఫ్ రోడింగ్ పెర్ఫామెన్స్‌కు ధీటుగా ఉంచేందుకు గాను మెట్జ్లర్ టైర్లను ఉపయోగించనున్నారు. త్వరలోనే ఈ టైర్లు బజాజ్-కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల్లో లభ్యం కానున్నాయి.
ఈ బైక్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో, ఇది సరమైన ధరకే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దేశీయ విపణిలో కెటిఎమ్ డ్యూక్ 390 బైక్ ఈ బైక్ బరువును తేలికగా ఉంచేలా దీని బాడీ నిర్మాణంలో తేలికపాటి ధృడమైన మెటీరియల్స్‌ను ఉపయోగించారు. దీని మొత్తం బరువు కేవలం 139 కేజీలు మాత్రమే. మే 25, 2013న ఈ బైక్ మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు మాత్రం జూన్ 2013లో ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








