ఏబిఎస్ ఆప్షన్‌తో విడుదల కానున్న కెటిఎమ్ డ్యూక్390

ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ కంపెనీ 'కెటిఎమ్' తమ తర్వాతి మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. భారత ప్రీమియం మోటార్‌సైకిల్ మార్కెట్లో స్పోర్ట్స్ బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని ఓ శక్తివంతమైన డ్యూక్ బైక్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో లభ్యమవుతున్న 'కెటిఎమ్ డ్యూక్390' భారత మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్ది ఈ ఏడాది మధ్య భాగం నాటికి విపణిలో విడుదల చేయనుంది.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న డ్యూక్200 బైక్‌ను పూనేలోని బజాజ్ ఆటో ప్లాంటులో కెటిఎమ్ ఉత్పత్తి చేస్తోంది. కాగా.. కెటిఎమ్ డ్యూక్390 బైక్ కూడా ఇదే ప్లాంటులో ఉత్పత్తికానుంది. కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్స్ బైక్‌లో పవర్‌ఫుల్ 375సీసీ, సింగిల్ సిలిండర్, పోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 44 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయనుంది. ఇందులో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, హై-క్వాలిటీ సస్పెన్షన్, బాష్ 9ఎమ్ ఏబిఎస్‌లు ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

KTM Duke 390

ఏబిఎస్ ఫంక్షన్ కోసం ఈ బైక్‌లోని ముందు, వెనుక టైర్లలో ఉండే సెన్సార్లు ఇండిపెండెంట్ ఈసియూకు కనెక్ట్ చేయబడి ఉంటాయి, ఇవి బ్రేకింగ్‌ను నియంత్రించేందుకు ఇంజన్ టార్క్‌ను కూడా పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో నాన్-ఏబిఎస్ వేరియంట్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది ఈ ఏడాది జూన్ నెల నాటికి ఇది మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం విపణిలో కంపెనీ అందిస్తున్న కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు కెటిఎమ్ డ్యూక్ 200 సొంతం.

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 15:28 [IST]
English summary
KTM Duke 390 is the most awaited Indian bike for 2013. A significant feature on the KTM Duke 390 for India will be the inclusion of Bosch’s 9M ABS option. It is expected to hit the roady by June.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+