హైదరాబాద్‌లో కెటిఎమ్ ఆరెంజ్ డే; బైకర్లకు కొత్త అనుభూతి
హైదరాబాద్: ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ హైదరాబాదీల కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ఆరెంజ్ డే' టొయోటా రేసింగ్ బృందం కేటీఎమ్ 200 డ్యూక్ కస్టమర్లకు రేసింగ్ అనుభూతిని అందించేందుకు ఈ ఆరెంజ్ డేను నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షామీర్ పేట్‌లోని బొమ్మారస్‌పేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
కెటిఎమ్ ఆరెంజ్ డేలో ప్రవేశం కేవలం కెటిఎమ్ డ్యూక్ యజమానులకు మాత్రమే. అయితే, ప్రతి కెటిఎమ్ యజమాని తన స్నేహితిడునో లేక కుటుంబ సభ్యులనో ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చు. ఇందులో రేసర్లు చేసే బైక్ విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా, ఈ విన్యాసాలను కెటిఎమ్ డ్యూక్ యజమానులు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు కూడాను.

కెటిఎమ్ డ్యూక్ బైక్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రేస్‌లో పాల్గొనవచ్చు. రేస్‌కు హాజరయ్యే వారికి కంపెనీ రైడింగ్ కిట్లను అందిస్తుంది. ఇందులో రైడింగ్ గ్లౌవ్స్, రైడింగ్ జాకెట్స్, క్నీ గార్డ్ వంటి ఉంటాయి (హెల్మెట్, రైడింగ్ బూట్స్ ఉండవు). ఈ కార్యక్రమానికి వచ్చే కెటిఎమ్ యజమానులందరికీ ముందుగా క్లాస్‌రూమ్, ప్రాక్టికల్ సెషన్లను నిర్వహించి, అందులో ఫాస్టెస్ట్ రేసర్లను గుర్తిస్తారు.
ఇలా గుర్తించబడిన ఫాస్టెస్ట్ రేసర్లు కెటిఎమ్ 200 డ్యూక్‌పై రియల్ రేసింగ్ అనుభూతిని పొందే అవకాశం ఉటుంది. ఈ సందర్భంగా కెటిఎమ్ యజమానుల కోసం కంపెనీ ఉచిత చెకప్ క్యాంప్‌ను కూడా నిర్వహించింది. మరోవైపు కెటిఎమ్ మర్చండైస్‌ను కూడా విక్రయానికి ఉంచింది.


Click it and Unblock the Notifications








