ఫ్రీడమ్ మోటార్‌సైకిల్‌ను పునఃప్రవేశపెట్టిన ఎల్ఎమ్ఎల్
కాన్పూర్‌కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ లోహియా మెషీనరీ లిమిటెడ్ (ఎల్ఎమ్ఎల్) భారత మార్కెట్లోకి సరికొత్తగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు గడచిన సంవత్సరం జులై నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఎల్ఎమ్ఎల్ ఒకప్పటి పాపులర్ మోటార్‌సైకిల్ ఫ్రీడమ్‌కు సరికొత్త మార్పులు చేర్పులు చేసి దేశీయ విపణిలో పునఃప్రవేశపెట్టింది.
తాజాగా మార్కెట్లోకి వచ్చిన 2013 ఎల్ఎమ్ఎల్ ఫ్రీడమ్ మోటార్‌సైకిల్‌లో110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. దేశీయ విపణిలో ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. దీని వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- 2013 ఎల్ఎమ్ఎల్ ఫ్రీడమ్ డిఎక్స్ - రూ.49,410
- 2013 ఎల్ఎమ్ఎల్ ఫ్రీడమ్ ఎల్ఎస్ - రూ.49,950
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ సరికొత్త 2013 ఎల్ఎమ్ఎల్ ఫ్రీడమ్ మోటార్‌సైకిల్‌లో స్టయిలిష్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ థీమ్డ్ ఇంజన్, క్రోమ్ గార్డ్‌తో కూడిన సైలెన్సర్, ఎలక్ట్రిక్ స్టార్ట్, గేర్ లాక్‌తో కూడిన సైడ్ స్టాండ్ (ఈ ఫీచర్ వలన సైడ్ స్టాడ్ వేసి ఉంటే గేర్ వేయటం సాధ్యం కాదు), కొత్త కలర్ ఆప్షన్స్, మెరుగుపరచిన సీట్, రీస్టయిల్డ్ ఫెయిరింగ్ మరియు పవర్, ఎకానమీ ఎల్ఈడి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ప్రధాన మార్పులను గమనించవచ్చు.
ఇది రెడ్, బ్లాక్, సిల్వర్, బీజ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ప్రస్తుతానికి ఇది ఢిల్లీ, ఎన్‌సిఆర్ రీజియన్లలోని ఎల్ఎమ్ఎల్ డీలర్‌షిప్ కేంద్రాలలో లభ్యం కానుంది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇది విడుదలయ్యే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








