పాంటెరో, సెంచురో మోటార్‍సైకిళ్లను ఆవిష్కరించిన మహీంద్రా
మహీంద్రా టూవీలర్స్ జనవరి మొదటి వారంలో కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించినట్లుగానే, కంపెనీ పాంటెరో, సెంచురో రెండు కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. ఇవి రెండు కూడా గతంలో కంపెనీ నిలిపి వేసిన 110సీసీ మోటార్‌సైకిల్ మహీంద్రా స్టాలియో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసినవే. ఇందులో మహీంద్రా పాంటెరో కమ్యూటర్ మోటార్‌సైకిల్ కాగా మహీంద్రా సెంచురో ప్రీమియం మోటార్‌సైకిల్.
మహీంద్రా పాంటెరో 110సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్:
స్టాలియోకు రీస్టయిల్డ్ వెర్షనే పాంటెరో. అయితే, ఇందులో సరికొత్త మహీంద్రా టూవీలర్ ఇంజన్‌ను ఉపయోగించారు. గతంలో స్టాలియో విషయంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది. మహీంద్రా పాంటెరోలో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, రోడియో స్కూటర్‌లో ఉపయోగించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే), 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లను అదనంగా జోడించారు.

మహీంద్రా టూవీలర్స్ పాంటెరో, సెంచురో అనే రెండు కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. ఇవి రెండు కూడా గతంలో కంపెనీ నిలిపి వేసిన 110సీసీ మోటార్‌సైకిల్ మహీంద్రా స్టాలియో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసినవే. ఇందులో మహీంద్రా పాంటెరో కమ్యూటర్ మోటార్‌సైకిల్ కాగా మహీంద్రా సెంచురో ప్రీమియం మోటార్‌సైకిల్.

మహీంద్రా పాంటెరో
స్టాలియోకు రీస్టయిల్డ్ వెర్షనే పాంటెరో. అయితే, ఇందులో సరికొత్త మహీంద్రా టూవీలర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

మహీంద్రా పాంటెరో
రోడియో స్కూటర్‌లో ఉపయోగించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే)మహీంద్రా పాంటెరోలోనూ ఉపయోగించారు.

మహీంద్రా పాంటెరో
మహీంద్రా పాంటెరోలో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లను అదనంగా జోడించారు.

మహీంద్రా సెంచురో
పాటెరోకు ప్రీమియం వెర్షనే సెంచురో. అయితే, మహీంద్రా సెంచురోలో అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా సెంచురో
రిమోట్ కీ ఆప్షన్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాల్లో రిమోట్ కీ ఆప్షన్‌తో లభ్యం కానున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే. ఈ రిమోట్ కీలో ఫైండ్ మి (Find Me) అనే ఆప్షన్ ఉంటుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు ఈ ఫైండ్ మి బటన్‌ను నొక్కినట్లయితే మీ బైక్ ఇండికేటర్లు ఆన్ అయ్యి, సులువుగా గుర్తు పట్టేందుకు సహకరిస్తుంది.

మహీంద్రా సెంచురో
అంతేకాకుండా, ఈ స్మార్ట్ మీ బైక్‌ను దొంగల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. కార్ల మాదిరిగానే ఇది ఫ్లిప్ కీ (కీని రిమోట్‌లోకి వెనక్కు మడిచిపెట్టవచ్చు). ఇది 96-బిట్ సెక్యూర్ యాక్సెస్‌ను కలిగి ఉంటుంది, దీనిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. ఈ రిమోట్ కంట్రోల్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌తో కూడుకుంది. ఇందులో ఎల్ఈడి టార్చ్, ఇమ్మొబిలైజర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.

మహీంద్రా సెంచురో
మహీంద్రా సెంచురో ప్రీమియం మోటార్‌సైకిల్‌లో సరికొత్త ఎల్ఈడి డిజిటల్ స్పీడో మీటర్‌ను గమనించవచ్చు.

మహీంద్రా సెంచురో
సరికొత్త బాడీ డీజైన్ అండ్ గ్రాఫిక్స్‌లు మహీంద్రా సెంచురోలో హైలైట్‌గా నిలువనున్నాయి.

మహీంద్రా పాంటెరో అండ్ సెంచురో
మహీంద్రా పాంటెరో అండ్ సెంచురో మోటార్‌సైకిళ్లలో ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ మరియు రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కామన్ ఫీచర్‌గా లభిస్తాయి.

మహీంద్రా పాంటెరో అండ్ సెంచురో
ఈ రెండు మోటార్‌సైకిళ్లలో 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా పాంటెరో
మహీంద్రా పాంటెరో లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా పాంటెరో
వాణిజ్య పరంగా ఈ మోటార్‌సైకిళ్లను ఎప్పుడు అంబాటులోకి తీసుకురానున్నది మరియు వీటి ధరల వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.

మహీంద్రా పాంటెరో
మహీంద్రా పాంటెరో ధర రూ.50,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

మహీంద్రా సెంచురో

మహీంద్రా సెంచురో

మహీంద్రా పాంటెరో
మహీంద్రా సెంచురో 110సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్:
పాటెరోకు ప్రీమియం వెర్షనే సెంచురో. అయితే, మహీంద్రా సెంచురోలో అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కీ ఆప్షన్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాల్లో రిమోట్ కీ ఆప్షన్‌తో లభ్యం కానున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే. ఈ రిమోట్ కీలో ఫైండ్ మి (Find Me) అనే ఆప్షన్ ఉంటుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు ఈ ఫైండ్ మి బటన్‌ను నొక్కినట్లయితే మీ బైక్ ఇండికేటర్లు ఆన్ అయ్యి, సులువుగా గుర్తు పట్టేందుకు సహకరిస్తుంది.
అంతేకాకుండా, ఈ స్మార్ట్ మీ బైక్‌ను దొంగల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. కార్ల మాదిరిగానే ఇది ఫ్లిప్ కీ (కీని రిమోట్‌లోకి వెనక్కు మడిచిపెట్టవచ్చు). ఇది 96-బిట్ సెక్యూర్ యాక్సెస్‌ను కలిగి ఉంటుంది, దీనిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. ఈ రిమోట్ కంట్రోల్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌తో కూడుకుంది. ఇందులో ఎల్ఈడి టార్చ్, ఇమ్మొబిలైజర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో సరికొత్త ఎల్ఈడి డిజిటల్ స్పీడో మీటర్, హెడ్‌లైట్‌కు పైభాగాన రెండు వైపులా జోడించిన ఎల్ఈడి ల్యాంప్స్ (పైలట్ ల్యాంప్స్), రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, సరికొత్త బాడీ డీజైన్ అండ్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.
ఇంజన్, మైలేజ్:
ఈ రెండు మోటార్‌సైకిళ్లలో 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మహీంద్రా పాంటెరో లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. వాణిజ్య పరంగా ఈ మోటార్‌సైకిళ్లను ఎప్పుడు అంబాటులోకి తీసుకురానున్నది మరియు వీటి ధరల వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.


Click it and Unblock the Notifications








