మహీంద్రా స్కూటర్స్ జిప్ జాప్ జూమ్ టెస్ట్ రైడ్ ఛాలెంజ్

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెంది ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న స్కూటర్ల కోసం ఓ సరికొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించింది. గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో మహీంద్రా డ్యూరో డిజెడ్ స్కూటర్ కోసం కంపెనీ ఓ టెస్ట్ డ్రైవ్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు అదే స్కీమ్‌ను కంపెనీ మరోసారి పునఃపరిచయం చేసింది.

'జిప్ జాప్ జూమ్ టెస్ట్ రైడ్ ఛాలెంజ్' పేరుతో మహీంద్రా టూవీలర్స్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో భాగంగా, ఎవరైనా కొనుగోలుదారులు కంపెనీ అందిస్తున్న డ్యూరో డిజెడ్, రోడియో ఆర్‌జెడ్, రోడియో ఆర్‌జెడ్ స్టాండర్డ్ స్కూటర్లను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వేరే బ్రాండ్ స్కూటర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, వారికి మహీంద్రా టూవీరల్స్ రూ.500 లను చెల్లిస్తుంది.

Mahindra Scooters Zip Zap Zoom Test Ride Challenge

జిప్ జాప్ జూమ్ టెస్ట్ రైడ్ ఛాలెంజ్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30, 2013 వరకూ చెల్లుబాటులో ఉంటుందని మరియు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా స్కూటర్లలో కంపెనీ జెడ్-సిరీస్ ఇంజన్లను ఉపయోగించారు. ఈ 125సీసీ ఇంజన్లను మంచి పెర్ఫామెన్స్‌నే కాకుండా, మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తాయని మహీంద్రా టూవీలర్స్ తెలిపింది.

జిప్, జాప్, జూమ్ అంటే మహీంద్రా స్కూటర్లు ఎత్తుగా ఉండే రోడ్లను సునాయాసంగా పైకి ఎక్కగలవు (జిప్), వీటి 125సీసీ ఇంజన్ పవర్‌తో ఇవి వేగంగా ముందుకు సాగిపోగలవు (జాప్) మరియు వాటి 59 కెఎమ్‌పిఎల్ మైలేజీని (జూమ్) ఇవ్వగలవని కంపెనీ వివరించింది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, రోడియో ఆర్‌జెడ్ మోడల్).

More from DriveSpark

Article Published On: Friday, April 19, 2013, 13:16 [IST]
English summary
Mahindra Two Wheelers is convinced that if you test ride its scooters you will not buy scooters from any other manufacturer. Under its ‘Zip Zap Zoom Test Ride Challenge', Mahindra has announced that it will pay you Rs. 500 if you still buy a different scooter after test riding a Mahindra scooter. The offer is applicable for Mahindra Duro DZ, Mahindra Rodeo RZ & Mahindra Rodeo RZ Std. and will last till April 30, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+