మహీంద్రా సెంచురో హిట్; కంపెనీ సేల్స్ సూపర్ హిట్

మహీంద్రా టూవీలర్స్ తాజాగా ప్రవేశపెట్టిన చీప్ అండ్ బెస్ట్ 110సీసీ మోటార్‌సైకిల్‌ 'మహీంద్రా సెంచురో' భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. మార్కెట్లోకి విడుదలైన మొదటి మూడు వారాల్లోనే 10,000 యూనిట్ల బుకింగ్‌లను సొంతం చేసుకున్న సెంచురో జోరుతో కంపెనీ జులై అమ్మకాలు ప్రోత్సాహకరంగా సాగాయి.

గడచిన సంవత్సరంలో జులై 2012 అమ్మకాలతో పోల్చుకుంటే జులై 2013లో కంపెనీ ద్విచక్ర వాహన అమ్మకాలు 46 శాతం వృద్ధి చెంది 14,612 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగ మహీంద్రా సెంచురో బైక్‌ల అమ్మకాలే ఉండటం విశేషం. ఈ మొత్తం అమ్మకాలలో 10,158 యూనిట్ల మహీంద్రా సెంచురో బైక్‌లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

ఈ సందర్భంగా మహీంద్రా టూవీలర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీరెన్ పోప్లీ మాట్లాడుతూ.. జులై అమ్మకాలు అత్యంత ప్రోత్సాహకరంగా ఉన్నాయని, తాము తాజాగా మార్కెట్లోకి విడుదల మహీంద్రా సెంచురో బైక్‌ను కొనుగోలుదారులు చక్కగా ఆదరిస్తున్నారని, అతి తక్కువ సమయంలోనే ఈ బైక్‌కు మంచి డిమాండ్ రావటం సంతోషంగా ఉందని అన్నారు.

Mahindra Centuro

ఈ సందర్భంగా తమ వినియోగదారులందరికీ ఆయన తన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. వినియోగదారులు తమపై పెంచుకున్న అంచనాలకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

మహీంద్రా సెంచురో జులై 1, 2013న విడుదలైంది. దేశీయ విపణిలో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్‌లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, August 5, 2013, 15:19 [IST]
English summary
Mahindra Two Wheelers, a part of the USD 16.2 billion Mahindra Group, has registered sales of 14,612 units during July 2013, an increase of 46% over the previous year. The company's innovative Centuro motorcycle has added to this sales momentum with 10,158 units being sold during the first month of its market launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+