మహి రేసింగ్ టీమ్ విజయం పట్ల థ్రిల్ అయిన నాగార్జున

టాలీవుడ్ నిత్య 'మన్మధుడు' యువతుల మనసు దోచే 'గ్రీకువీరుడు' మన అక్కినేని నాగార్జునకు వేగంగా వెళ్లే స్పోర్ట్స్ బైక్‌లన్నా, బైక్ రేస్‌లన్నా ఎంతో ఆసక్తి అన్న విషయం మనందరికీ తెలిసినదే. సూపర్ చిత్రంలో తన సూపర్ డూపర్ రైడ్‌తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున 'మహి రేసింగ్ టీమ్ ఇండియా' రైడర్ ఫ్యాబీన్ ఫోరెట్‌ను అభినందించారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అక్కినేని నాగార్జున, నందీష్ దొమలూర్‌లు సంయుక్తంగా కలిసి ఈ మహి రేసింగ్ టీమ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, గడచిన ఆదివారం స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ సూపర్ స్పోర్ట్ ఛాంపియన్‌‌షిప్‍‌లో మహి రేసింగ్ టీమ్ ఇండియా రైడర్ ఫ్యాబీన్ ఫోరెట్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 18 ల్యాప్స్ కలిగిన రేస్‌లో 2'02.743 ఫాస్టెస్ట్ ల్యాప్ రికార్డును సృష్టించి అధ్భుతమైన విజయాన్ని నమోదు చేయటంతో హీరో అక్కినేని నాగార్జున ఫోరెటను కలిసి తన అభినందనలు తెలియజేశారు. ఫ్యాబీన్ ఫోరెట్‌కు తన కెరీర్‌లో ఇది 16వ రేస్ విజయం. 2002 డబ్ల్యూఎస్ఎస్ ఛాంపియన్ అయిన ఫోరెట్, ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో లీడర్‌గా ఉన్నాడు.

"మా జట్టు సాధించిన విజయం మాకెంతో థ్రిల్‌ను కలిగించింది. క్వాలిఫైయింగ్ రౌండ్ సమయంలో మా రైడర్లు స్పెయిన్‌లో కూడా ఫిలిఫ్ ఐల్యాండ్ మ్యాజిక్‌ను మళ్లీ సృష్టితారని మాకు తెలుసు, వాళ్లు మమ్మల్ని నిరుత్సాహపరచలేద"ని జట్టు ఓనర్లు నాగార్జున, నందీష్ దోమలూర్‌లు చెప్పారు. ఇదొక అద్భుతమైన రేస్ అని, చాలా ఉత్సాభరితంగా ఉన్నదని, భారత్‌లో తమ అభిమానాలు ఈ ఉత్సాహాన్ని పంచుకుంటారని తాను భావిస్తున్నానని నాగార్జున చెప్పారు.

మూడుసార్లు వరల్డ్ సూపర్‌స్పోర్ట్ ఛాంపియన్ అయిన కెనన్ సోఫ్యోగ్లు మహి రేసింగ్ టీమ్ ఇండియాకు ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలోని ఫిలిప్ ఐల్యాండ్‌లో జరిగిన రేస్‌లో 1'33.283 కొత్త ల్యాప్ రికార్డును సృష్టించి, ఈ జట్టుకు తొలి విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ సందర్భంగా మహి రేసింగ్ టీమ్ ఇండియా రైడర్ ఫ్యాబీన్ ఫోరెట్ మాట్లాడుతూ, ఇది తమ జట్టుకు ఓ గొప్ప విజయమని అన్నారు. రానున్న సీజన్లలో కూడా తమ పెర్ఫామెన్స్ ఇలానే కొనసాగేలా చూసుకుంటామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2013, 12:23 [IST]
English summary
Popular Telugu actor Nagarjuna, co-owner of the Mahi Racing Team India, on Monday said that he was thrilled over his team winning a second consecutive race at the 2013 World Supersport Championship in Motorland Aragon, Spain, a day ago. Nagarjuna, who along with another co-owner Nandish Domlur is in Spain, said in a statement released here on Monday that he was excited over the team's back-to-back win.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+