భారత టూవీలర్ మార్కెట్లోకి మరొక జపనీస్ బ్రాండ్
భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరొక జపనీస్ బ్రాండ్ ప్రవేశించనుంది. టోక్యోకు చెందిన 'ఓషిరో' (Oshiro) ఇండియన్ టూవీలర్ మార్కెట్లో ప్రవేశించడానికి గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ఓషిరో తొలుతగా 100-150సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను, 100-150సీసీ సామర్థ్యం కలిగిన స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.
మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న సటారా ప్లాంట్‌లో ఓషిరో తమ ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్‌కు ఓషిరోకు ఇండియన్ హెడ్‌క్వార్టర్స్‌గా పనిచేయనుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్లాంటు ఆగస్ట్ 2013 నాటికి పూర్తి కావచ్చని అంచనా. ఇదే సమయం నాటికి ఓషిరో తమ మోటార్‌సైకిళ్లను, స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది.
ఈ నేపథ్యంలో, ఓషిరో ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాల్లో డీలర్ల కోసం వేట ప్రారంభించింది. దేశీయ విపణిలో ఓషిరో తమ టూవీలర్లను సరసమైన ధరకే అందించనుంది. భారత మార్కెట్లో ఇప్పటికే యమహా, సుజుకి, కవాసకి వంటి జపనీస్ టూవీలర్ బ్రాండ్‌లు మంచి సక్సెస్‌ను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఓషిరో కూడా సక్సెస్ సాధించవచ్చని తెలుస్తోంది. ఓషిరో టూవీలర్లకు సంబంధించిం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








