లీటరుకు రూ.1.15 తగ్గిన పెట్రోల్ ధర; డీజిల్‌పై 50 పైసల పెంపు

మోటారిస్టులకు దీపావళి కానుకగా, చమురు కంపెనీలు పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించాయి. అయితే, ఇదే సమయంలో డీజిల్ ధరను లీటరుకు 50 పైసల చొప్పున పెంచారు. గడచిన జూన్ నెల నుంచి వరుసగా ఏడు సార్లు పెట్రోల్ ధరను పెంచిన చమురు కంపెనీలు, సెప్టెంబర్ 30వ తేదీన ఏకంగా లీటరుపై రూ.4 మేర తగ్గించిన సంగతి తెలిసినదే.

కాగా.. తాజాగా, డాలరుతో పోల్చుకుంటే, రూపాయి విలువ స్వల్పంగా బలపడటంతో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ.1.15 చొప్పున తగ్గింపును (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ప్రకటించాయి. అయితే, డీజిల్‌పై సబ్సిడి భారాన్ని తగ్గించుకునేందుకు గాను ప్రతినెలా డీజల్ ధరను స్వల్పంగా పెంచుతున్నట్లుగానే, ఈసారి కూడా లీటరుపై 50 పైసల చొప్పున ధరను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి.

Petrol Price Cut

తగ్గిన పెట్రోల్ ధర అలాగే పెరిగిన డీజిల్ ధరలు గురువారం అర్థరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. తాజా పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
* ఢిల్లీ - రూ.71.02 (పెట్రోల్); రూ.53.10 (డీజిల్)
* ముంబై - రూ.78.04 (పెట్రోల్); రూ.60.08 (డీజిల్)
* కలకత్తా- రూ.78.07 (పెట్రోల్); రూ.57.49 (డీజిల్)
* చెన్నై - రూ.74.22 (పెట్రోల్); రూ.56.61 (డీజిల్)

More from DriveSpark

Article Published On: Saturday, November 2, 2013, 8:12 [IST]
English summary
In a second reduction within a month, state-run oil marketing companies (OMCs) on Thursday announced reduction of Rs. 1.15 a litre in price of petrol but hiked diesel prices by 50 paise a litre from midnight on Thursday night.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+