లీటరుకు రూ.1 చొప్పున తగ్గిన పెట్రోల్ ధర

పెట్రోల్ ధరను లీటరుపై 85 పైసలు చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) తగ్గించాలని నిర్ణయించడమైనదని ఇండియన్ ఆయిల్ సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ తగ్గింపును ప్రకచించామని సదరు కంపెనీ పేర్కొంది. తగ్గిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి:
* ఢిల్లీ - రూ.67.29
* ముంబై - రూ.74.14
* కలకత్తా- రూ.74.72
* చెన్నై - రూ.70.42


Click it and Unblock the Notifications








