మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర; లీటరుకు రూ.2కు పైగా వడ్డింపు

By Ravi

Petrol Price Hiked Again
పెట్రోల్ ధర మరోసారి భగ్గుమంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో పాటుగా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కూడా భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, పెట్రోల్ ధరను రూ.1.82 పైసల మేర పెంచుతూ (స్థానిక పన్నులు కలుపుకోకుండా) చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలో వరుసగా పెట్రోల్ ధరను పెంచడం ఇది మూడవసారి.

అసలే పెరిగిన నిత్యావసర ధరలతో బాధపడుతున్న సమాన్యులకు తాజా పెంపు మరింత భారం కానుంది. స్థానిక పన్నులు కలుపుకుంటే హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.38 పైసల మేర పెరిగింది. ఇదివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.72.46గా ఉండేది. తాజా పెంపుతో ఇది రూ.74.84కు పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

చమురు కంపెనీలు ఈ నెల 1వ తేదీన లీటరు పెట్రోల్‌పై 75 పైసలు చొప్పున అలాగే, 16వ తేదిన రూ.2 చొప్పున పెంచిన సంగతి తెలిసినదే. మొత్తమ్మీద చూసుకుంటే ఒక్క నెల కాలంలో పెట్రోల్ ధర లీటరుపై సుమారు రూ.5 లకు పైగా పెరిగింది. ఇదిలా ఉండే వచ్చే వారం డీజిల్ ధరను కూడా 40-50 పైసల చొప్పున పెంచాలని చమురు కంపెనీ యోచిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, June 29, 2013, 10:04 [IST]
English summary
Petrol price was hiked by a steep Rs 1.82 a litre, the third increase in rates this month, as falling rupee made imports costlier. An increase in diesel rates is expected early next week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+