పెట్రో వాత: లీటరుపై రూ.1.40 చొప్పున పెంపు

గత నెల 16న కూడా చమురు కంపెనీ లీటరుపై రూ.1.50 చొప్పున పెంపును విధించిన విషయం తెలిసినదే. జనవరిలో కూడా స్వల్పంగా పెట్రోల్ ధరలను (న్యూఢిల్లీలో) పెంచారు. ఈ సంవత్సరంలో పెట్రోల్ ధరలను పెంచడం ఇది మూడవసారి.
అంతర్జాతీయ మార్కెట్లలో ఆయిల్ ధరలు పెరగటం, రూపాయి విలువ పతనం అవుతుండంటతో వేరే మార్గం లేక ధరలను పెంచుతున్నామని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో పలు ప్రధాన నగరాల్లో అమల్లో ఉన్న పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* ఢిల్లీ - రూ.70.74
* ముంబై - రూ.77.66
* కలకత్తా- రూ.78.34
* చెన్నై - రూ.73.95


Click it and Unblock the Notifications








