తగ్గిన ముడి చమురు ధరలు; తగ్గనున్న పెట్రోల్ ధర!

భారత్‌కు ముడి చమురు బ్యారల్ 97.66 డాలర్లకే లభించింది. అయితే ఇది తిరిగి ప్రస్తుతం 101 డాలర్లకు ఎగబాకింది. గత కొన్ని రోజుల నుంచి డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కూడా అనుకూలంగా లేదు. అయినప్పటికీ, చమురు మార్కెటింగ్ కంపెనీలు గత పక్షం రోజుల నుంచి జరిగిన పరిణామాలను తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పెట్రోల్ ధరను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడాది జనవరిలో డీజిల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలుకు నెలకు లీటరుకు 50-51 పైసల చొప్పున పెంచుతూ వస్తున్నాయి. ఇలా డీజిల్ ధరలను ఇప్పటి వరకు మూడు సార్లు పెంచడం జరిగింది.


Click it and Unblock the Notifications








