నవంబర్ 26న రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి విడుదల

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులందరికీ ఇది నిజంగానే స్వీట్ న్యూస్. గడచిన కొద్ది కాలంగా రాయల్ ఎన్‌‌ఫీల్డ్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్ 'కాంటినెంటల్ జిటి' రేపు (నవంబర్ 26, 2013న) దేశీయ విపణిలో విడుదల కానుంది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కాంటినెంటల్ జిటి బైక్‌ను తొలిసారిగా గడచిన సెప్టెంబర్ నెలలో యూకే మార్కెట్లో విడుదల చేసింది.

అక్కడి మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి బైక్ ధర 5,200 పౌండ్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.5.2 లక్షలు). కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ చెన్నైలోని తమ ఓరగడం ప్లాంట్‍‌లో ఉత్పత్తి చేస్తోంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 60 ఏళ్ల చరిత్రలో తొలి కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ కావటం విశేషం. 50, 60వ దశకాల్లోని కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేశారు.

Royal Enfield Continental GT

కాంటినెంటల్ జిటి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యం కానున్న అత్యంత శక్తివంతమైన మరియు తేలికైన మోటార్‌సైకిల్. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌‌లో 535సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ యూనిట్ కన్స్‌ట్రక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28.7 హెచ్‌పిల శక్తిని, 44 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలోపుగా ఈ బైక్ వీడియోను వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2QKTBdigs5M?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, November 25, 2013, 11:16 [IST]
English summary
Royal Enfield Continental GT will make its debut in India tomorrow. That's Tuesday, November 26th. The Chennai based motorcycle manufacturer launched the Continental GT in the U.K in early September where it's priced at £5,200 or around INR 5.2 lakhs.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+