ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2014
భారతీయ పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన 'కాంటినెంటల్ జిటి' కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్, విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రతిష్టాత్మక మోటార్‌సైకిల్ అవార్డును దక్కించుకుంది. కెటిఎమ్ 390 డ్యూక్, హ్యోసంగ్ ఆక్విలా ప్రో మోడళ్లను పక్కకు నెట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 2014 సంవత్సరానికి గాను 'ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్' (ఐఎమ్ఓటివై)ను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2014
అమెరికన్ కార్ ఆఫ్ ది ఇయర్, యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్, జపనీస్ కార్ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డుల మాదిరిగానే ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్, ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందించడం జరుగుతుంది. ఈ అవార్డుల ద్వారా తయారీదారుల్లో పోటీతత్వాన్ని పెంచడం, ఫలితంగా సరికొత్త టెక్నాలజీతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులకు ఆజ్యం పోయటం జరుగుతుంది.
భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి బైక్ ధర రూ.2.05 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ)గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌లో 535సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 535ససీ ఇంజన్ 5100 ఆర్‌పిఎమ్ వద్ద 29.1 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 44 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications









