ఆర్‌సి సిరీస్ బైక్‌లను విడుదల చేయనున్న కెటిఎమ్
డ్యూక్ సిరీస్ బైక్‌ల విడుదలతో స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో మంచి విజయాన్ని సాధించిన ఆస్ట్రియన్ కంపెనీ కెటిఎమ్ ఇప్పుడు కొత్తగా ఆర్‌సి సిరీస్ బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కెటిఎమ్ ఇటీవలే పలు ఆటో షోలలో ప్రదర్శనకు ఉంచిన ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లను వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 2014లో న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో కెటిఎమ్ ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. సరసమైన ధరకే డ్యూక్ 200, డ్యూక్ 390 బైక్‌లను ఆఫర్ చేస్తూ, మార్కెట్లో మంచి ఆదరణ చూరగొన్న కెటిఎమ్, ఈ కొత్త ఆర్‌సి సిరీస్ బైక్‌లను అంతే సరసమైన ధరలకు ఆఫర్ చేయగలదని సమాచారం.

ఈమేరకు కెటిఎమ్ తమ ఇండియన్ వెబ్‌సైట్‌ను ఈ కొత్త బైక్‌లతో అప్‌డేట్ చేసింది. ఆర్‌సి సిరీస్ బ్రాండ్ పేజ్‌లో మొత్తం నాలుగు మోడళ్లు (ఆర్‌సి 125, ఆర్‌సి 200, ఆర్‌సి 390, 1190 ఆర్‌సి8 ఆర్ ఈయూ) ఉండగా, అందులో రెండు మోడళ్లు (ఆర్‌సి 200, ఆర్‌సి 390) త్వరలోనే భారత్‌కు వస్తున్నాయంటూ కెటిఎమ్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్‌లో ఉపయోగించిన 200సీసీ 25 పిఎస్‌ల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే కెటిఎమ్ 390లో ఉపయోగించిన 375సీసీ ఇంజన్ గరిష్టంగా 43 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న డ్యూక్200, డ్యూక్390 నేక్డ్ బైక్‌లకు స్పోర్ట్స్ వెర్షన్లే ఈ ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లు. ఈ రెండు బైక్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








