స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సిస్ స్కూటర్ విడుదల

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా అందిస్తున్న యాక్సెస్ 125సీసీ స్కూటర్‌లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌ (Being Human Foundation)తో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్‌ను ప్రవేశపెడుతున్నామని సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు.

ఈ ఒప్పందంలో భాగంగా, సుజుకి డీలర్లు బీయింగ్ హ్యూమర్ అప్పీరల్స్‌ను, మర్చైండైజ్‌లను కూడా విక్రయించనున్నారు. భారత మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సిస్ స్కూటర్ ధరను రూ.58,978 (అన్-రోడ్ ముంబై)గా నిర్ణయించామని అతుల్ తెలిపారు. కాగా.. రెగ్యులర్ వెర్షన్ సుజుకి యాక్సిస్ స్కూటర్ ధర రూ.57,887 (ఆన్-రోడ్, ముంబై)గా ఉంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

సల్మాన్ ఖాన్ ఇప్పటికే సుజుకి మోటార్‌సైకిళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని, తాజా ఒప్పందం దీనికి కొనసాగింపని ఆయన చెప్పారు. సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌లలో బీయింగ్ హ్యూమన్ దుస్తులు, వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. సుజుకి భాగస్వామ్యంతో బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృతమవుతాయని అన్నారు.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

ఈ స్కూటర్ బాడీపై ట్రెండీ 'అప్నా వే ఆఫ్ లైఫ్' అనే లోగోను చూడొచ్చు.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్ స్కూటర్ వెనుక భాగంలో స్టయిలిష్ క్రోమ్ గ్రాబ్ రెయిల్‌ను జోడించారు.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్ స్కూటర్‌కు కొత్తగా స్టన్నింగ్ క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్‌‌ను అమర్చారు.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్ స్కూటర్‌కు ముందు వైపు కొత్తగా బీయింగ్ హ్యుమన్ లోగోను జోడించారు.

స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్

ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి యాక్సెస్ స్కూటర్‌లో మరొక ప్రత్యేకత ఏంటంటే, విలాసవంతమైన లెథర్ సీట్.

More from DriveSpark

Article Published On: Thursday, October 3, 2013, 11:53 [IST]
English summary
Suzuki Motorcycle India has partnered with the Being Human Foundation, an initiative by Bollywood actor Salman Khan, to launch a special edition of its scooter 'Suzuki Access'. As part of the tie-up, Suzuki dealers will also sell Being Human apparel and merchandise.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+