యువత కోసం స్టీల్‌బర్డ్, ఎమ్‌టీవీ నుంచి సరికొత్త శ్రేణి హెల్మెట్స్

By Ravi

హెల్మెట్ల తయారీలో పేరుగాంచిన బ్రాండ్ స్టీల్‌బర్డ్ మరియు మ్యూజిక్ ఛానెల్స్‌లో పేరుగాంచి ఎమ్‌టివి సంస్థలు చేతులు కలిపి అమ్మాయిలు, అబ్బాయిల కోసం సరికొత్త శ్రేణి హెల్మెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేకించి ఫ్యాషన్ కోరుకునే నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హెల్మెట్లను అందంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు.

హెల్మెట్ ధరించడం వలన అత్యవసర సమయాల్లో ప్రాణాలు దక్కించుకోవచ్చన్న సంగతి తెలిసినదే. అయితే, కొంత మంది మాత్రం హెయిర్ స్టయిల్ పాడవుతుందనో, జుట్టు ఊడిపోతుందనో వంకలు చెప్పి హెల్మెట్ పెట్టుకోవటం మానేసి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో హెల్మెట్ ఉపయోగించి గురించి అవగాన పెంచుతూనే, స్టయిలిష్ హెల్మెట్లతో మరింత స్టయిలిష్‌గా మారిపోండని చెప్పేందుకు స్టీల్‌బర్డ్, ఎమ్‌టివి సంస్థలు ఈ ప్రయత్నం చేశాయి.


ఈ హెల్మెట్లు ఆకర్షనీయమైన రంగుల్లో, ఫంకీ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేయబడ్డాయి. ఇవి చూడటానికి స్టయిలిష్‌గా ఉండటమే కాకుండా ఐఎస్ఐ ప్రమాణాలకు లోబడి తయారు చేయబడినవి కూడా. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా ఉన్న 10 స్టోర్లలో మాత్రమే లభ్యమవుతున్నాయి. త్వరలోనే వీటి అందుబాటు రేంజ్‌ను 200 స్టోర్లకు విస్తరింపజేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇవి ఫుల్ ఫేస్, హాఫ్ ఫేస్, రెగ్యులర్, నిన్జా స్టయిల్ మొదలగు విభిన్న రూపాల్లో వినియోగదారుల ఎంపికను బట్టి అందుబాటులో ఉన్నాయి.
Helmet 2

More from DriveSpark

Article Published On: Wednesday, September 4, 2013, 18:58 [IST]
English summary
Leading helmet manufacturer Steelbird has collaborated with leading music channel MTV to bring out a new range of attractively designed helmets targeted at the youth.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+