బజాజ్‌లో కొనసాగుతున్న సమ్మె, డ్యూక్ డెలివరీ జాప్యం

By Ravi

KTM Bikes
వేతనాల సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పూనేకు సమీపంలో ఉన్న బజాజ్ ఆటో ఛాకన్ ప్లాంటులో సుమారు 2000 మంది కార్మికులు ఈనెల 25 నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసినదే. దీంతో ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోవటంతో బజాజ్ అందిస్తున్న కొన్ని రకాల మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది.

ఛాకన్ ప్లాంటులో ఏటా 12 లక్షల మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో ప్రధానంగా పల్సర్, అవెంజర్, నిన్జా, కెటిమ్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా కంపెనీ తాజాగా ప్రవేసపెట్టిన కెటిఎమ్ 390 డ్యూక్ మోటార్‌సైకిల్ కూడా ఇదే ప్లాంటులో ఉత్పత్తి అవుతోంది. సరసమైన ధరకే ఈ బైక్ మార్కెట్లో విడుదలైనప్పటికీ, తాజా కారణంగా దీని డెలివరీలు మరికొంత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తాయి.

కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం కూడా సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. సమ్మె ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ ఈ విషయంపై కార్మికులతో చర్చించేందుకు బజాజ్ ఆటో యాజమాన్యం నుంచి ఎలాంటి సూచనలు లేవు. వేతనాల సవరణ, ప్లాంటులో మంచి పని వాతారణాలను ఏర్పాటు చేసే వరకు తమ సమ్మె కొనసాగుతూనే ఉంటుందని, దీనిపై చర్చించేందుకు బజాజ్ యాజమాన్యం తమని పిలువలేదని బజాజ్ ఆటో యూనియన్ వర్గాలు తెలిపాయి.

ఛాకన్ ప్లాంటులో 925 మంది శాస్వత కార్మికులు పనిచేస్తుండగా, 1000 మంది తాత్కాలిక, కాంట్రాక్ట్, ట్రైనీ వర్కర్లు పనిచేస్తున్నారు. ఈ 1000 మంది వర్కర్లు కూడా తమ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యూనియన్ 25 శాతం వేతనాలను పెంచడంతో పాటు తాత్కాలిక, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరుతుంది. అలాగే సస్పెండ్ చేసిన కొంత మంది ఉద్యోగులను మరియు ఛాకన్ ప్లాంటు నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి ఇదే ప్లాంటుకు పిలిపించాలని కూడా యూనియన్ డిమాండ్ చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2013, 17:51 [IST]
English summary
Demand for the newly released KTM Duke 390 was recognized well before the bike launched. Thousands are expected to ditch their existing rides, including Duke 200 owners. Bookings for the 390 began the day after the launch, but a few dealers had in fact started accepting bookings much before. While you can go ahead and pay a down payment of Rs 30,000 to book one for yourself, the current waiting period being reported is three months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+