సుజుకి మోటార్‌సైకిల్ గుర్గావ్ ప్లాంట్‌లో సమ్మె సెగలు!

అకారణమైన క్రమశిక్షణ చర్యలపై ఈ యూనియన్‌కు చెందిన అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్‌లతో పాటుగా ప్రదీప్ కుమార్ అనే కార్మికుడిని కంపెనీ యాజమాన్యం సప్పెండ్ చేసింది. ఈ విషయంపై వారు యాజమాన్యంతో పాటు కార్మికశాఖతో కూడా చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదని, కార్మికులు మరో 15 -20 రోజులపాటు వేచిచూసి హోలీ తర్వాత తమ డిమాండ్లు తీర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ తెలిపారు.
ఈ విషయమై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) అనిల్ ముంజాల్ వ్యాఖ్యానిస్తూ, స్ట్రైక్ గురించి వర్కర్లు తమకు నోటీసు గానీ లేదా సమాచారం కానీ ఇవ్వలేదని, ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కంపెనీ యొక్క ఉన్నతాధికారులపై చేయి చేసుకున్నందుకే సదరు యూనియన్ జనరల్ సెక్రటరీని, ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








