వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్‌లో హీరో మోటోకార్ప్

By Ravi

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ గతంలో అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్)ను తమ సాంకేతిక భాగస్వామిగా ఎంచుకున్న సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎరిక్ బ్యూయెల్ రేసింగ్‌‌తో కలిసి '2014 వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్'లో పాల్గొనబోతుంది.

ఈ నేపథ్యంలో, ఈబిఆర్ ఇటీవలే చేసిన రేస్-ఓన్లీ వెర్షన్ '1190ఆర్ఎక్స్'ను విడుదల చేసింది (ఈ బైక్ ప్రొడక్షన్ మోడల్ కాదు, దీనిని కేవలం రేస్‌ల కోసం మాత్రమే ఉపయోగిస్తారు). ఈ జట్టుకు 'టీమ్ హీరో ఈబిఆర్' అనే పేరును పెట్టారు. ఈ టీమ్ యజమాని క్లాడియో క్వింటారెలీ మరియు టీమ్ మేనేజర్ గియులియో బార్డీ.

EBR 1190RX

టీమ్ హీరో ఈబిఆర్ తమ 'ఈబిఆర్ 1190ఆర్ఎక్స్' బైక్‌తో '2014 వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్' రేస్‌లో పాల్గొంటుంది. ఇందు కోసం జియాఫ్ మే, ఆరన్ యేట్స్‌లు తమ జట్టుకు రైడర్లుగా నియమించుకుంటున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ ఇద్దరు రేసర్లు ఈబిఆర్ తరఫున ఏఎమ్ఏ సూపర్‌బైక్ సిరీస్‌లలో పాల్గొన్నారు.

వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్‌లోకి హీరో మోటోకార్ప్ ప్రవేశించనుండటంతో, ఇందులో పాల్గొనబోతున్న మొట్టమొదటి భారతదేశపు ద్విచక్ర వాహన కంపెనీగా హీరో మోటోకార్ప్ రికార్డు సృష్టించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2013, 8:33 [IST]
English summary
Hero MotoCorp will become the first Indian two wheeler manufacturer to take part in the World Superbike Championship (WSBK), during the 2014 season. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+