మేడ్ ఇన్ ఇండియా 'ట్రైయంప్ డేటోనా 250' బైక్
ఈ ఏడాది ఇటలీలోని మిలాన్‌లో జరిగిన 2013 ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షో అనేక 'మేడ్ ఇన్ ఇండియా' బైక్‌ల ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. ఈ షోలో ఇప్పటికే హోండా, హ్యార్లీ డేవిడ్‌సన్, కెటిఎమ్ వంటి కంపెనీలు భారత మార్కెట్ కోసం అలాగే గ్లోబల్ మార్కెట్ల కోసం తయారు చేసిన/అభివృద్ధి చేసిన మేడ్ ఇన్ ఇండియా బైక్‌లను ప్రదర్శనకు ఉంచాయి.
తాజాగా, బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీ ట్రైయంప్ కూడా ఓ 250సీసీ ఇంజన్‌ను కలిగిన బైక్‌ను అభివృద్ధి చేస్తామని, దీనిని పూర్తిగా భారత్‌లో తయారు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఓ టీజర్ స్కెచ్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ట్రైయంప్ అందిస్తున్న పాపులర్ డేటోనా సిరీస్‌లోనే ఈ కొత్త 250సీసీ వెర్షన్ కూడా రానుంది.

డేటోనా 250 ఓ గ్లోబల్ ప్రోడక్ట్ అని, 2015లో దీనిని పరిచయం చేస్తామని ట్రైయంప్ వెల్లడించింది. భారత్‌లో ట్రైయంప్ ప్లాంట్‌లోనే ఈ బైక్‌ను తయారు చేయనుండటం మరో ముఖ్యమైన అంశం. ఈ ఫొటోలో మీరు చూస్తున్నది తమ చిన్న బైక్‌కు సంబంధించి ట్రైయంప్ విడుదల రెండరింగ్ ఇమేజ్. ఈ విషయం గ్లోబల్ ప్రియులకు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, ఇండియాలో మాత్రం ఇది ఊహించినదే.
ట్రైయంప్ ఇప్పటికే ఓ స్ట్రీట్ ట్రిపుల్ స్టైల్ 250సీసీ థంపర్ బైక్‌ను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ బైక్‌ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ అలాగే పొరుగు దేశాల మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. నేక్డ్ 250సీసీ బైక్ (బాడీ ప్యానెల్స్ లేని బైక్) విడుదల గురించి ట్రైయంప్ ప్రస్తావించలేదు, కానీ ఇది డేటోనా 250 కన్నా ముందే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండు బైక్‌లలోను ఒకే ఇంజన్ ఉపయోగించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








