250సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న ట్రైయంప్

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ 'ట్రైయంప్' నుంచి అత్యంత చవకైన స్పోర్ట్స్ బైక్ భారత మార్కెట్లోకి రానుంది. గడచిన సంవత్సరం దేశీయ విపణిలోకి ప్రవేశించిన ట్రైయంప్, ఇండియన్ స్పోర్ట్స్ బైక్ లవర్స్ కోసం ఓ 250సీసీ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రైయంప్ వచ్చే ఏడాది నుంచి భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయనుంది.

ఇందుకోసం కర్ణాటకలోని నర్సాపూర్ వద్ద ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంటు నిర్వహణలోకి రానుంది. ఈ ప్లాంటులో తొలుతగా 250సీసీ పారలల్ ట్విన్-సిలిండర్ మోటార్‌సైకిల్‌ను ట్రైయంప్ ఉత్పత్తి చేయనుంది. ఈ మోడల్ ఉత్పత్తి లోకలైజేషన్ స్థాయిని పెంచడం ద్వారా తక్కువ ధరకే ఈ బైక్‌ను అందించాలని యోచిస్తోంది. ట్రైయంప్ నుండి మార్కెట్లోకి రానున్న కొత్త 250సీసీ మోటార్‌సైకిల్ ఈ సెగ్మెంట్లోని కెటిఎమ్ డ్యూక్ 200, కవాసకి నిన్జా 250ఆర్, హోండా సిబిఆర్250ఆర్, హ్యోసంగ్ జిటి250ఆర్ వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది.


బెంగుళూరుకు సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న నర్సాపూర్ ప్రాంతంలో ఓ కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సుమారు 30 ఏకరాల విస్తీర్ణంలో అత్యాధనిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ కేంద్రాన్ని ట్రైయంప్ ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త ప్లాంట్ కోసం కంపెనీ సుమారు 850 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ ప్లాంటును ప్రారంభంలో భాగంగా సాలీనా 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన మోటార్‌సైకిళ్లను సమీప దేశాలకు ట్రైయంప్ ఇండియా ఎగమతి చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 12, 2013, 15:18 [IST]
English summary
The iconic British motorcycle brand Triumph Motorcycles will manfucter a 250cc motorcycle for India. The company will commence production of a 250cc parallel twin-cylinder engine motorcycle from next year at its new plant that is being set up at Narasapur, about 52 kms from Bangalore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+