టీవీఎస్ స్కూటీ గిరి ఆఫర్: పెప్ ప్లస్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న 'టీవీఎస్ స్కూట్ పెప్ ప్లస్' స్కూటర్‌పై విద్యార్థుల కోసం బంపర్ ఆపర్‌ను అందిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని వారికి తమ స్కూటర్ కొనుగోలుపై 5 శాతం వరకు నగదును వెనక్కు ఇస్తామని కంపెనీ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది 10, 11 మరియు 12వ తరగతులకు చెందిన విద్యార్థులు తమ మార్స్ కార్డును చూపించి ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం అమ్మాయిలకు మాత్రమే కాకుండా అబ్బాయిలకు కూడా వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఒకవేళ మీరు విద్యార్థి కాకపోయినట్లయితే, మీ కంపెనీ ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్‌ను అందిస్తుంది.

అంతేకాకుండా, తమ స్కూటర్‌ను లోనులో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం, కేవలం రూ.7,999/- డౌన్‌పేమెంట్‌కే 7.99 శాతం వడ్డీ రేటు వద్ద కంపెనీ ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో అధీకృత టీవీఎస్ డీలర్‌షిప్‌ను సందర్శించండి.
టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ అమ్మాయిల ఆల్‌టైమ్ ఫేవరేట్ స్కూటర్. టీవీఎస్ అందిస్తున్న స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ నేటి తరం అమ్మాయిలకి ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్‌లో 87.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.68 కి.వా. శక్తిని, 5.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








