వీడియో: యమహా రే జెడ్ కొత్త టెలివిజన్ కమర్షియల్
జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్, గర్ల్స్ కోసం అందిస్తున్న రే స్కూటర్‌లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రే జెడ్ పేరుతో బాయ్స్ కోసం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, యమహా రే జెడ్ స్కూటర్‍కు ప్రచారాన్ని కల్పించేందుకు గాను, దీనిపై రూపొందించిన ఓ సరికొత్త టెలివిజన్ కమర్షియల్‌ను కంపెనీ విడుదల చేసింది. యమహా రే జెడ్, మీ కొత్త బ్రదర్ (Yamaha RAY Z Your New Bro) అనే థీమ్‌తో ఈ టివిసి ఉంటుంది. ఈ టివిసిలో యమహా తమ రే జెడ్ స్కూటర్ ఫీచర్లను హైలైట్ చేసింది.
యమహా రే జెడ్ స్కూటర్ విషయానికి వస్తే, మహిళల కోసం యమహా అందిస్తున్న రే స్కూటర్‌ను కొద్దిగా మార్చి రే జెడ్ పేరుతో కంపెనీ ఈ మోడల్‌ను అందిస్తుంది. ఈ రెండు స్కూటర్లలో డిజైన్ పరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు. రే జెడ్ స్కూటర్‌లో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ముందు వైపు ఓ స్పెషల్ విండ్ షీల్డ్‌లను అమర్చారు. రేసింగ్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన బాడీ గ్రాఫిక్స్, హైడ్‌లైట్‌కు పై భాగంలో బ్లాక్ కలర్ క్రింది భాగంలో వైట్ లేదా రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో ప్రధాన ఫీచర్లు.
భారత మార్కెట్లో యమహా రే జెడ్ స్కూటర్ ధర రూ.48,555/- (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. యమహా రే జెడ్ స్కూటర్‌లో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7. పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 53 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








