బిఐసిలో డబ్ల్యూఎస్‌బికె ఇండియా రౌండ్ రద్దు
ఈ ఏడాది నవంబర్ నెలలో గ్రేటర్ నోయిడాలో ఉన్న బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో జరగాల్సి ఉన్న వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూఎస్‌బికె)ను భారత్ నిర్వహించట్లేదు. నంబర్ 17వ తేది నుంచి జరగాల్సిన ఈ మోటార్‌స్పోర్ట్‌ను రద్దు చేసినట్లు ఎఫ్ఐఏ ధృవీకరించింది. కార్యనిర్వహణ సవాళ్లు, భద్రత అంశాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఈ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ రేసింగ్ కార్యక్రమాన్ని మార్చ్ నెలలో నిర్వహించాల్సి ఉంది, కానీ దీనిని కొన్ని కారణాల వలన నవంబర్ నెలకు వాయిదా వేశారు. బిఐసి ట్రాక్‌పై ఇది తొలి మోటార్‌సైకిల్ రేస్ కావటంతో, అక్కడి సిబ్బంది అందుకు సిద్ధంగా ఉండేందుకే వాయిదా వేశారు. అయితే, ఈ విషయంలో సేఫ్టీ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని 2014లోనే నిర్వహించనున్నారు.
ఎఫ్ఎమ్‌ఎస్‌సిఐ ప్రెసిడెంట్ వికీ ఛందోక్ మాట్లాడుతూ.. ఈ రేస్ నిర్వహణ వాయిదా వేయాలని జెపిఎస్ఐ కోరిందని, దానికి అనుగుంగా డోర్నా (డబ్ల్యూఎస్‍బికె హక్కుదారు)తో కలిసి ఏర్పాట్లు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇండియన్ మోటార్‌స్పోర్ట్ ప్రియులకు ఇది రెండవ బ్యాడ్ న్యూస్. ఇప్పటికే 2014 ఇండియన్ గ్రాండ్ ప్రి (అంతర్జాతీయ ఫార్ములా వన్ రేస్)ను రద్దు చేసిన సంగతి తెలిసినదే.



Click it and Unblock the Notifications








