మహిళా కస్టమర్ల కోసం యమహా 'ఐ యామ్ రే' కార్యక్రమం

By Ravi

హైదరాబాద్: జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్, తమ మహిళా కొనుగోగులదారుల కోసం నేడు (మార్చి 16, 2013, శనివారం) 'ఐ యామ్ రే' (I Am Ray) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమ రే స్కూటర్లను కొనుగోలు చేసిన మహిళా వినియోగదారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ కార్యక్రమంలో భాగంగా రే స్కూటర్‌ను కొనుగోలు చేసిన మహిళలు వివిధ స్వచ్ఛంద సంస్థలను సందర్శిస్తారని ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వారికి యమహా టి షర్ట్‌ను, ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను అందిస్తామని, అలాగే హెల్మెట్ కొనుగోలులో 50 శాతం రాయితీతో వివిధ ప్రోత్సాహకాలను కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది.

యమహా ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని తమ రే స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 7.0 పిఎస్‌ల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ నిబంధనల ప్రకారం). దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. యమహా ఐ యామ్ రే కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలో అధీకృత యమహా డీలర్‌షిప్‌ను సందర్శించండి.

Yamaha Ray Deepika

More from DriveSpark

Article Published On: Saturday, March 16, 2013, 8:28 [IST]
English summary
Japanese two-wheeler manufacturer India Yamaha Motor has conducting a unique programme called 'I Am Ray' on Saturday for its female customers. The company is providing unique opportunities to its female buyer on this day. Please visit your nearest showroom for more details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+